మిడి మిడి జ్నానంతో చేసే వ్యాఖ్యలు చేయటం ద్వారా పరువు పొగొట్టుకోవటం మన సెలబ్రిటీలకు కొత్తేం కాదు. కొద్ది రోజుల క్రితం నటి శిల్పాశెట్టి తన అతి తెలివితో సోషల్ మీడియాలో నవ్వుల పాలయ్యింది. రష్యా తిరుగు బాటుకు సంబంధించిన కథాంశాలతో కూడిన పుస్తకం ఎనిమల్ ఫామ్ ను చిన్న పిల్లల పుస్తకంగా అభివర్ణించి తిట్లు తింది. ఇక ఇప్పుడు ఆవిడగారి భర్త వంతు వచ్చింది. ఇంతకీ వీళ్లు ఏం చేశారనేగా మీ అనుమానం.
సొట్ట బుగ్గల బ్యూటీ దీపిక పదుకునే హాలీవుడ్ డెబ్యూ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ క్సాండర్ విదేశాల కంటే ముందుగా మన దగ్గరే విడుదలైన విషయం తెలిసిందే. అయితే కంటెంట్ అంతంతగా మాత్రంగా ఉండటం, పైగా దీపిక రోల్ కూడా పెద్దగా లేకపోవటంతో జనాలు సినిమాపై పెదవి విరిచేశారు. క్రిటిక్స్ కూడా పూర్ రేటింగ్ ఇవ్వటంతో సినిమా అంతంత మాత్రంగానే ఆడుతోంది.
అయితే సోమవారం ఈ సినిమాను జుహూ లోని పీవీఆర్ మాల్ లో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా తో కలసి వీక్షించింది. ఏం జరిగిందో ఏమో తెలీదుకానీ, సినిమా మొదలైన అరగంటకే వారిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కట్ చేస్తే... సినిమా అద్భుతంగా ఉందని, దీపిక రోల్ సూపర్బ్ అంటూ రాజ్ కుంద్రా తన ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడు. చూడని సినిమాకు సూపర్ రేటింగ్ ఇచ్చిన అతగాడి ట్వీట్ పై రీట్వీట్లు ఏ రేంజ్ లో పడుంటాయో ఇక మీరే ఊహించేసుకోండి.
Watched #xandercagereturns last night and @deepikapadukone you were superbbbbb Great movie and the action is out of this world!! #FullHouse
— Raj Kundra (@TheRajKundra) January 18, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more