వర్మ ఒపినీయన్: జల్లికట్టు తీవ్ర వాదం కన్నా నేరం, సపోర్ట్ ఇచ్చే వాళ్లను ఎద్దులతో పొడిపించాలి | Varma opposed government's move on Jallikattu.

Ram gopal varma opposed jallikattu

Ram Gopal Varma, Ban on Jallikattu, RGV slams Jallikattu supporters, Varma opposed Jallikattu, RGV Jallikattu Tweets, Traditional Tamil Nadu sport, Jallikattu Ram Gopal Varma Opinion.

Ram Gopal Varma opposed jallikattu Tweets against Government Lift of Ban on Jallikattu.. Slams celebrities, supporters of traditional Tamil Nadu sport.

జల్లికట్టుపై వర్మ స్టైల్ ట్వీట్లు

Posted: 01/21/2017 12:48 PM IST
Ram gopal varma opposed jallikattu

ఊరందరిది ఒకదారి..ఉలిపికట్టెది ఒకదారి అన్న చందాన ఉంది దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యవహారం. తమిళనాడునే కాదు, దేశం మొత్తం జల్లికట్టు యవ్వారంతో ఊగిపోతుంది. అంతా ముక్తకంఠంతో తమ మద్ధతును ప్రకటించేశారు. బాషాబేధాలకు అనుగుణంగా సినిమా సెలబ్రిటీలు ఒకరిద్దరు మినహా అంతా జల్లికట్టుకు జై చెప్పేశారు. అయితే వర్మ మాత్రం రోటీన్ కు భిన్నంగా స్పందించాడు.

జల్లికట్టును సపోర్టు చేస్తున్న వారిని ఏకిపారేశాడు. ''తమిళ వారికి జల్లికట్టు అనేది కరక్ట్ అయితే.. ఆల్ ఖైదీ తీవ్రవాదులకు కూడా అమాయకులైన వారిని పీక కోసి చంపడం కూడా కరక్టే. సినిమావాళ్ళేమో తెర మీద కనీసం ఒక పిట్టను కూడా హింసించినట్లు చూపకూడదు కాని.. తమిళ ప్రజలు మాత్రం గోవులను దారుణంగా హింసిస్తూ జల్లికట్టు ఆడుకోవచ్చా? జల్లికట్టు అనేది అనాగరికం'' అంటూ ట్వీట్లతో విరుచుకుపడ్డాడు వర్మ.

''జనాల ఆనందం కోసం మూగ జీవాలను హింసించడమే జల్లికట్టు. జయలలిత శశికళ వంటి లీడర్లను తెగల జాతుల్లా పూజించే జనాలకు ఇది కూడా నప్పిందిలే. జల్లికట్టును సపోర్టును చేస్తున్న సెలబ్రిటీలను.. 100 ఎద్దులతో తరుముతూ పరిగెత్తించాలి. అప్పుడు తెలుస్తుంది వారికి జనాలు ఎద్దులను తరిమితే వాటి ఫీలింగ్ ఎలా ఉంటుందో'' అంటూ రామూ గాట్టిగానే ఎద్దేవా చేశాడు. అసలు ఒక అనాగరిక హక్కు కోసం పోరాడుతున్న ఆ జనాలను ఏమనాలి? జంతువులను టార్చర్ చేయడానికి అధికారం అడుగుతున్న వారికి ఏమని చెప్పాలి?

''నోరు లేని జీవాలను జల్లికట్టు పేరుతో హింసించడం.. తీవ్రవాదం కంటే పెద్ద నేరమే'' అంటూ ముగింపు పలికాడు. వోట్ల కోసం.. పార్టీ టిక్కెట్ల కోసం.. ఈ సెలబ్రిటీలు అందరూ జల్లికట్టుకు సపోర్టునిస్తున్నారంటూ ఫైరయ్యాడు. మొత్తానికి తన ట్వీట్లతో వర్మ ఈసారికి మాత్రం కాస్త ఆలోచింపజేసే ప్రశ్నలనే వేశాడు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal varma  Jallikattu  slam  Kollywood  

Other Articles