రాజకీయ ఆరంగ్రేటం చేయటం ఏమోగానీ పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం నత్తనడకన సాగుతూ వస్తోంది. ఎన్నికల సమయంలో పూర్తిగా ప్రచారంలో బిజీ అయిపోయిన పవన్ ఆ టైంలో సినిమాల ఊసుఎత్తలేదు. అయినా అభిమానులు చాలా ఓపికగా ఎదురు చూశారు. ఆ తర్వాత గ్యాప్ తో సర్దార్ గబ్బర్ సింగ్ గా ముందుకు వచ్చినా నిరాశపరిచాడు. మళ్లీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసేయటం, పైగా కాటమరాయుడు షూటింగ్ మొదలుపెట్టి ఫస్ట్ లుక్ అంటూ హడావుడి చేయటంతో పవన్ అభిమానుల్లో సందడి నెలకొంది.
అయితే ఉన్నపళంగా తిరిగి రాజకీయ సమస్యలపై దృష్టిసారించటంతో సినిమాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పటికే సగంకి పైగా షూటింగ్ అయిపోయిన కాటమరాయుడు ఇంకా టాకీ పార్ట్ బాలెన్స్ తోపాటు పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. జనవరి 26న టీజర్ రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు అఫీషియల్ గానే టీజర్ పోస్ట్ పోన్ అంటూ ప్రకటించింది.
#Katamarayudu teaser will not be released on 26th Jan. Will announce the date soon. Stay subscribed and thanks for the support
— Northstar (@nseplofficial) January 22, 2017
ఇష్టం ఉన్న సమయానికి షూటింగ్ కు వస్తాడని, తనకు నచ్చని దర్శకులను మార్చేస్తాడన్న విమర్శలు ఇప్పటికే పవన్ పై ఉన్నాయి. అవన్నీ అధిగమిస్తూ ఎలాగోలా కాటమరాయుడు చాలా ఫాస్ట్ గా మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకుంది. ఇలాంటి సమయంలో ప్రత్యేక హోదా లాంటి పెద్ద బాధ్యతను నెత్తిన వేసుకుంటే మాత్రం సినిమా అనుకున్న టైంకి రిలీజ్ కావటం అనుమానమే. పవన్ కళ్యాణ్ కష్టాలు షరామామూలేగా అనేవారి నోళ్లు మూత పడాలంటే వ్యవహారాలను తొందరగా చక్కనపెట్టుకుని త్వరగతిన మిగతా ప్రాజెక్టులపై కూడా కాంసంట్రేషన్ చేస్తే మంచిదని సీనియర్లు సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more