మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 కలెక్షన్లు కుమ్ముడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రీఎంట్రీ తర్వాత అది కూడా ఓవర్సీస్ లో చిరు మ్యాజిక్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. మొదటి పదిరోజుల్లోనే రెండు మిలియన్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన ఖైదీ ఆ తర్వా స్క్రీన్లు భారీగా పడిపోవటం, కొత్త సినిమాలు రావటంతో నిదానించింది. బుధవారం వరకు 2.40 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో కొత్త రికార్డు క్రియేట్
చేయటమే కాదు, టాలీవుడ్ ఆల్ టైం లిస్ట్ లో నంబర్ 3 స్థానంలో నిలిచింది.
బాహుబలిని మినహాయిస్తే యూఎస్ లో శ్రీమంతుడు అత్యధిక కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత నితిన్-త్రివిక్రమ్ ల అ.. ఆ..., నాన్నకు ప్రేమతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ఇప్పుడు ఖైదీ అ.. ఆ... ను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలవటం విశేషం. ఓ సీనియర్ హీరో చిత్రాల్లో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన సినిమా ఖైదీయే కావటం విశేషం. ఇంతకు ముందు ఊపిరికి అక్కడ మంచి స్పందనే వచ్చినప్పటికీ
ఈ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద డాలర్ల వర్షం మాత్రం కురిపించలేకపోయింది. బాహుబలి కంటే ఖైదీ తోపా?
అయితే ప్రీమియర్ షోలతోనే మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఖైదీ, లాంగ్ రన్ లో 3 మిలియన్ క్లబ్ దరిదాపుల దాకా వచ్చినప్పటికీ అ.. ఆ... మాదిరి లాభాలను మాత్రం ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు ట్రేడ్ అనాలసిస్ట్ లు. మరోవైపు తెలుగు రాస్ట్రాల్లో కూడా ఖైదీ ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. నైజాం, సీడెడ్ ఏరియాల్లో ఇప్పటికే భారీ లాబాలు డిస్ట్రిబ్యూటర్స్ ఖాతాలోకి వచ్చి చేరాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more