ఏడాదిన్నర గ్యాప్ తర్వాత మళ్లీ మాస్ రాజా కెమెరా ముందుకు దర్శనమిచ్చేశాడు. లాంగ్ హాలీడే్స్ ను ఎంజాయ్ చేసి తిరిగొచ్చాక ఎన్నో కథలు విన్నప్పటికీ ఒక్కదాన్ని కూడా ఓకే చేయలేకపోయాడు. అయితే రెమ్యునరేషన్ ఓకే కాకనే రవితేజ ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు వినిపించాయి. ఏది ఏదైతేనేం ఎట్టకేలకు ఒకేసారి రెండు ప్రాజెక్టులకు ఓకే చెప్పి మళ్లీ హైలెట్ అయ్యాడు రవితేజ.
అందులో ఒకటి విక్రమ్ సిరికొండ డెబ్యూ డైరక్టర్ తో చేయబోయే టచ్ చేసి చూడు, మరోకటి అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్. అల్రెడీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన టచ్ చూసి చూడు షూటింగ్ ఈరోజు మొదలుపెట్టేశారు. హీరో రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ క్లాప్ ఇవ్వగా, సీనియర్ ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ రోజు నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుండగా వారం రోజులకు పైగా ఇక్కడే తొలి షెడ్యూల్ జరగనుంది. ఇక తదుపరి షెడ్యూల్ ని పాండిచ్చేరిలో 25 రోజులు జరపనున్నారు. రాశి ఖన్నా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రీతం సింగ్ సంగీతం అందించనున్నాడు. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
రీసెంట్ గా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన రవితేజ థాంక్స్ షూటింగ్ ప్రారంభమైందని ఓ వీడియోను కూడా పోస్ట్ చేయటం విశేషం. మరోవైపు అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ లో అంధుడి పాత్రలో మాస్ రాజా నటించబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే అఫీషియల్ గా ప్రారంభం కానుంది. మొత్తానికి గతేడాది లోటును రెండు సినిమాలతో ఒకేసారి పూరీంచనున్నాడు రవితేజ.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more