ఎన్టీఆర్ ఇండియన్ బెస్ట్ డాన్సర్.. ఓట్లు ఎవరు వేశారసలు? | Google ranking NTR number 1 Dancer in India.

Junior ntr is best dancer in india

Google Best Dancer, NTR Best Dancer, Best Dancer in India, Google Junior NTR, NTR Dance, Junior NTR Chiranjeevi, NTR Hritik Allu Arjun, NTR Allu Arjun Dance, NTR Number 1 Rank, Online Poll Junior NTR, NTR Best Moments, NTR Steps, NTR Number One Dancer

Google released top 10 best Indian dancers. Tollywood Hero NTR at top in that List. Megastar Chiranjeevi in 10th Position.

ఎన్టీఆర్.. ఇండియన్ బెస్ట్ డాన్సర్

Posted: 02/04/2017 08:50 AM IST
Junior ntr is best dancer in india

టాలీవుడ్ పై బెస్ట్ డాన్సర్ ఎవరన్న దానిపై సమాధానం ఇవ్వటం కొంచెం కష్టం. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ స్టర్ లలో దాదాపు అందరూ ఆ విషయంలో దుమ్ము రేగొట్టేవారే. కొందరు అగ్రహీరోలను మాత్రం మినహాయిస్తే మిగతా వారంతా అభిమానుల కోసం ఎప్పటికప్పుడూ కొత్త తరహా మూమెంట్లతో పూనకం తెప్పించేవారే. అయితే ఇండియాలో బెస్ట్ డాన్సర్ ఎవరన్న దానిపై ఓ ఆన్ లైన్ పోల్ ఇచ్చిన ఫలితం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

టాప్ టెన్ ది బెస్ట్ డాన్సర్స్ ఎవరంటూ టోటల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన పోల్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో నిలిచాడు. 23 శాతం ఓట్లతో తారక్ ఈ లిస్ట్ లో ఫస్ట్ స్థానాన్ని కైవసం చేసుకోవటం విశేషం. ఇక బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సెకండ్ ఫ్లేస్ లో నిలవగా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ థర్డ్ పిజిషన్ కైవసం చేసుకున్నాడు. వీరిద్దరి 22, 11 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇండియన్ మైకేల్ జాక్సన్ నాలుగు, రాఘవ లారెన్స్ లు 4, 5వ స్థానాల్లో నిలవటం విశేషం. ఇక బాలీవుడ్ హీరోయిన్లు మాధురీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్ లు 6, 9 స్థానాలు దక్కించుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 7వ స్థానంలో నిలిచాడు.

మరోవైపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ 10వ పొజిషన్ లో నిలిచి తన సత్తా చాటాడు. టాలీవుడ్ కు డాన్సుల్లో కొత్త ఒరవడి సృష్టించిన చిరుకు మళ్లీ ప్రేక్షకులు పట్టం కట్టడం విశేషం. ఇక మెగా తనయుడు రాంచరణ్ ఈ లిస్ట్ లో 17వ స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఓటింగ్ ఏ ప్రామాణికంగా నిర్వహించారన్నదానిపై క్లారిటీ లేకపోయినా, తమ హీరో టాప్ స్థానం కైవసం చేసుకున్నాడన్న వార్తతో నందమూరి అభిమానులు తెగ ఖుషీ చేసుకుంటుండగా, మరో వర్గం అభిమానులు అంతా ఉత్తదేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

అయితే ఇక్కడ వారంతా ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ డాన్సుల్లో తోపు అన్న మాట నిజమే. గతంలో హృతిక్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పుకొచ్చాడు. అలాగని మిగతా వాళ్లను కూడా తక్కువ చేయకూడదు. అందుకే లేనిపోని విమర్శలు మానుకోని, ఒక తెలుగు హీరోకి నంబర్ వన్ ఘనత దక్కిందని సంతోషపడటమే ఇప్పుడు మన ముందు ఉన్న కర్తవ్యం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Google  NTR  Allu Arjun  Best Dancers  India  

Other Articles