తన లాంగ్ ఫ్రెండ్ కమ్ లవ్ లవ్ సమంతతో సీక్రెట్ రొమాంటిక్ ట్రాక్, ఆపై అఫీషియల్ ఎంగేజ్ మెంట్ కానిచ్చేసిన నాగ చైతన్య ప్రస్తుతం ఆ మూడ్ నుంచి బయటపడే పనిలో ఉన్నాడు. అదేనండీ సినిమాల వైపు మళ్లీ తన దృష్టిని మళ్లించాడు. లేటెస్ట్ గా ఈ అక్కినేని వారసుడి కొత్త ప్రాజెక్ట్ అఫీషియల్ గా లాంఛ్ అయ్యింది.
మేనమామ సురేష్ బాబు, మరో స్టార్ ప్రోడ్యూసర్ సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం ద్వారా కృష్ణ ఆర్వీ మరిముత్తు అనే డెబ్యూ డైరక్టర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. ఇక ఇందులో చై సరసన లావణ్య త్రిపాఠి నటించనుంది. ఈ ఉదయం ముహుర్తం షాట్ తో ప్రారంభమైన సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. నటుడు శ్రీకాంత్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రాజమౌళి ఫ్యామిలీతో పాటు మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మరోవైపు సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో చైతూ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ లీడ్ రోల్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో ఓ సీనియర్ నటి కీలకపాత్ర పోషించబోతుందని సమాచారం. బంగార్రాజు, అల్లరి అల్లుడు అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more