అనసూయ ఐటెం సాంగ్ లో సుమ కూడానా? | Anchor Suma Turns Singer for Winner Item Song.

Anchor suma new avatar for anasuya

Star anchor Suma, Suma Sing Song, Suya Suya Song Singer, Thaman Anchor Suma, Anchor Suma Anasuya, Anasuya Suma, Suma Song, Anasuya Item Song, Winner Movie Item Song, Anchor Turns Singer, Anchor Suma Sing A Song

Star anchor Suma to create sensation as a singer. She has crooned Suya Suya song in Thaman's musical Winner, to be launched by Tamil Star Musician Anirudh Ravichander at 7 PM today. This is the song in which Anchor Anasuya shook her booty.

అనసూయ కోసం సింగర్ గా సుమ

Posted: 02/07/2017 06:07 PM IST
Anchor suma new avatar for anasuya

సాధారణంగా తన పాటలకు అరుదైన గాత్రాలను అందించటంలో మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఎప్పుడు ముందుంటాడు. అది ఎలాగంటే స్టార్ హీరోలైన ఎన్టీఆర్, మహేష్, ఆఖరికి కాజల్ లాంటి హీరోయిన్ల చేత కూడా పాటలు పాడించేంతగా... అలాంటి థమన్ ఇప్పుడు మరో అరుదైన ఫీట్ ను చేశాడు.

బుల్లితెర యాంకర్ గా.. సినిమా కార్యక్రమాల హోస్ట్ సుమ ఎంత ఫేమస్ అనే విషయం తెలిసిందే. అందుకే సుమ వాయిస్ లో బేస్ ఎనర్జీని క్యాచ్ చేసిన థమన్ ఆమెతో ఓ పాటను పాడించేశాడు. అది కూడా మరో హాట్ యాంకర్ అనసూయ పై కంపోజ్ చేసిన సాంగ్ కావటమే ఇక్కడ అసలు స్పెషాలిటీ.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన సాయి ధరంతేజ్ మూవీ విన్నర్ పాటలను.. స్టార్స్ తో లాంఛ్ చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు.. సమంతలు ఒక్కో పాటను లాంఛ్ చేయగా.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు "సుయ సుయ" అంటూ సాగే ఐటెం పాటను లాంఛ్ చేయనున్నారు. దీనిని కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ లాంఛ్ చేయనున్నాడు.

సుమ లాంటి క్రేజ్ ఉన్న యాంకర్ లోని ఈ కోణాన్ని వెలికి తీసిన థమన్ కి హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేమేమో కదా! అన్నట్లు ఈనెల 9వ తేదీన విన్నర్ ట్రైలర్ ను రిలీజ్ చేసి మధ్యలో ప్రీ రిలీజ్ పంక్షన్, ఆపై 24న విన్నర్ మూవీని రిలీజ్ చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anchor Suma  Sing  Thaman  Anchor Anasuya  Winner  Item Song  

Other Articles