ఇంతకీ ఇతగాడు తెలుగు హీరోనేనా? | Nara Rohit Rugged Look In Kathalo Rajakumari.

Kathalo rajakumari first look released

Kathalo Rajakumari, Kathalo Rajakumari Frist Look, Nara Rohit New Look, Nara Rohit Kathalo Rajakumari, Kathalo Rajakumari Motion Poster, Kathalo Rajakumari Actress, Kathalo Rajakumari Hero, Nara Rohit Mass Look, Nara Rohit Kathalo Rajakumari, Nara Rohit Valentines Day

Rohit is coming up with yet another concept based film Kathalo Rajakumari. In the film’s first look poster released on the special eve of Valentines Day, Nara Rohit is looking rugged with grown beard. The stern expression on his face, cigarette in mouth, a weapon in hand and the arduous get-up hint that, he will be seen in a massy role in the film touted to be a romantic action entertainer.

కథలో రాజకుమారి ఫస్ట్ లుక్.. మోషన్ పోస్టర్

Posted: 02/14/2017 08:42 AM IST
Kathalo rajakumari first look released

సినిమా సినిమాకు, కథ కథకు అస్సలు సంబంధం ఉండదు.. అయినా వరుసగా హిట్లు కొడుతూ వస్తున్నాడు నారా రోహిత్. అసుర తర్వాత రెండు వరుస ఫ్లాపులు అతని ఖాతాలో పడ్డప్పటికీ, ఆపై జ్యో అచ్యుతానంద, అప్పట్లో ఒకడుండేవాడుతో కమర్షియల్ హిట్లు కొట్టడమే కాదు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుని మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ జోనర్ సినిమాతోనే వస్తున్నాడు ఈ నారా వారబ్బాయి.

కథలో రాజకుమారి అంటూ మరో సినిమాతో రాబోతున్నాడు. రెండు రోజుల క్రితం చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ను చూడగానే ఆహ్లాదకరంగా.. అందంగా అనిపిస్తూ మనసు దోచేలా కనిపించటంతో ఓ లవ్ స్టోరీతో రాబోతున్నాడని అర్థమైంది. ఈరోజు 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు కూడా. అయితే కాసేపటి క్రితం రిలీజ్ అయిన నారా రోహిత్ ఫస్ట్ లుక్ ను చూస్తే ఆశ్చర్యపోవటం ఖాయం.

లుంగీ కట్టు, బారెడు గడ్డం చేతిలో కత్తి నోట్లో సిగరెట్ పీక గెటప్ విషయంలో అరవ సినిమాలో హీరోలా భయంకరంగా ఉన్నప్పటికీ కాస్త వైవిధ్యమైన కథతోనే రాబోతున్నట్లు అర్థమౌతోంది. ఓ మాస్ వ్యక్తి ప్రేమలో పడటం అనే కథాంశంగా దర్శకుడు రూపొందించాడేమో అనిపిస్తోంది. ఇక లుక్కుతో సంబంధం లేకుండా ‘లవ్ ఇన్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫామ్’ అనే క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది.

మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజాతోపాటు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూరుస్తుండటం విశేషం. నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య.. మంచు లక్ష్మి గెస్ట్ రోల్స్ చేయబోతున్నారని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Kathalo Rajakumari  First Look  

Other Articles