బాహుబలి కోసం మరో కీ డేట్ | Baahubali 2 Trailer date fix.

Baahubali trailer release date

Baahubali 2 Trailer, Baahubali 2 Trailer Date, Baahubali The Conclusion Date Fix, March 15th Baahubali 2, Baahubali 2 Trailer Mumbai, Baahubali 2 Official Trailer

Date Fixed For Baahubali 2 Trailer Launch. The trailer is going to be released on 15th March and this trailer launch event will be held in Mumbai.

మార్చి 15న బాహుబలి ట్రైలర్

Posted: 03/06/2017 06:43 PM IST
Baahubali trailer release date

ఈరోజుల్లో ఒక చిత్రంపై అంచనాలు పెరగాలంటే టీజర్, ట్రైలర్ చాలూ. కానీ, రెండేళ్ల క్రితం ‘బాహుబలి: ది బిగినింగ్’ ట్రైలర్ కి అలాంటివి అవసరం పడలేదు. కేవలం విజువల్ వండర్ గా వచ్చి దేశవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది ఆ చిత్ర ట్రైలర్. ఇక ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’పై ఇప్పటికే ఉన్న భారీ అంచనాల్ని ట్రైలర్ మరింతగా పెంచే అవకాశం ఉంది.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రతి సినీ ప్రేక్షకుూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాడు. ఇంకో యాభై రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే అంతకంటే ముందు ట్రైలర్ తో మ్యాజిక్ చేయబోతున్నాడు జక్కన్న. ఈ నెల 15న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ట్రైలర్ రిలీజవబోతున్నట్లు తాజా సమాచారం. ఆల్రెడీ మార్చి మధ్యలో ట్రైలర్ వస్తుందని ఇంతకు ముందు ప్రకటించాడు కూడా. ఈ మధ్యే సెంథిల్ ఆ విషయంలో ఓ క్లారిటీ కూడా ఇచ్చాడు.

అన్ని పనులు పూర్తి కావటంతో ట్రైలర్ ను ముంబై లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్దం అవుతోంది. అది రిలీజయ్యాక ఓ రెండు వారాల వ్యవధిలో ఆడియో వేడుకను భారీ స్థాయిలో చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం.  ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటంతో ఏప్రిల్ 28న విడుదల కాకపోవచ్చనే వార్తల్లో నిజం లేదని చిత్ర యూనిట్ చెబుతోంది. చూస్తుంటే భారతీయ సినీ చరిత్రలోనే ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద ఉన్నంత అంచనాలు అతిశయోక్తిగా అనిపించక మానదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali The Conclusion  Trailer Date  

Other Articles