నయన్ డోరా టీజర్: అంత ఎగ్జయిటింగ్ గా లేదా? | Nayanatara New Movie Teaser Released.

Nayanatara dora telugu teaser out

Nayanatara, Nayanatara Dora Movie, Dora Movie Teaser, Dora Telugu Teaser, Dora Teaser, Dora Movie, Dora Telugu Movie, Nayanatara New Movie Teaser, Nayanatara Movie Teaser, Nayanatara New Movie, Nayanatara Upcoming Movie

Nayanatara Bilingual movie Dora telugu teaser released.

నయనతార డోరా తెలుగు టీజర్ రిలీజ్

Posted: 03/08/2017 10:35 AM IST
Nayanatara dora telugu teaser out

సౌత్ సీనియర్ హీరోయిన్ నయనతార ఈ మధ్య మెచ్యూర్డ్ ఉన్న కథలతోనే సినిమాలను తీస్తోంది. కారణాలేవైనా ఎక్స్ పోజింగ్ కు చాలా దూరంగా ఉంటున్న నయన్, డీగ్లామర్ రోల్స్ తోనే వరుస సక్సెస్ లు అందుకుంటోంది. ఇక లెటెస్ట్ గా ఆమె ప్రధాన పాత్రలో బైలింగువల్ సినిమాగా డోరా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ పరంగా ఆసక్తిని క్రియేట్ చేసినప్పటికీ, గతంలో వచ్చిన మయూరి(మాయా) లాగా ఆసక్తిని మాత్రం క్రియేట్ చేయలేకపోయింది. ఈ చిత్ర తెలుగు వర్షన్ టీజర్ రీసెంట్ గా రిలీజైంది. మరి అది ఎలా ఉందో చూద్దాం. ఓ కారులో ఆత్మ.. అమ్మాయిని వెంబడించటం, తన లక్ష్యాన్ని సాధించుకునేంత వరకు అది వదలకపోవటం ఇలా సాగిపోతుంటుంది. తమిళ వర్షన్ టీజర్ నే డబ్ చేసి వదిలారు. ఆత్మ వెంటపడటం అనే సింగిల్ పాయింట్ ను మాత్రం చూపించారే తప్ప అసలు కాన్సెప్ట్ అసలు మ్యాటర్ ను రివీల్ చేయలేదు.

 

హర్రర్ థ్రిల్లర్ కు కావాల్సిన మెయిన్ పాయింట్ కంటెంట్ లేదా కామెడీ. ఈ రెండింటిలో ఏ జోనర్ అయినా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తే మాత్రం డోరా సక్సెస్ అవ్వటం ఖాయం. డోరాను మార్చి 30న ఉగాది కానుకగా రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. మరి నయన్ డోరాతో మరోసారి మాయ చేస్తుందా చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Nayanatara  Dora Movie  Telugu Teaser  

Other Articles