కాటమరాయుడు ఫస్ట్ డే.. ప్చ్.. ఖైదీని కొట్టలేకపోయాడు. రీజన్ ఏంటో తెలుసా? | Katamarayudu not beat Khaidi No 150 Firstday Collections.

Katamarayudu first day collections

Pawan Kalyan Katamarayudu, Katamarayudu First Day Collections, Katamarayudu First Day Report, Katamarayudu Collection Report, Katamarayudu First Day Share

Pawan Kalyan Katamarayudu First Day Collection Report out. Collected a distributor share 23.05 Cr of on it’s Day1 in Telugu states. This is All Time 2nd biggest opening for any film in Telugu states behind Khaidi No 150 which had collected a distributor share of 23.28 Cr.

కాటమరాయుడు ఫస్ట్ డే కలెక్షన్లు

Posted: 03/25/2017 11:50 AM IST
Katamarayudu first day collections

ఫ్యాన్స్ కి ముందే పండగనిస్తూ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. వరల్డ్ వైడ్ గా 2500 స్క్రీన్లలో సందడి చేసిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 1500కి పైగా రిలీజ్ అయ్యింది. మరోవైపు చెన్నైతోపాటు ఓవర్సీస్ లో కూడా అత్యధిక స్క్రీన్ లలోనే కాటమరాయుడు సందడి చేసింది. మరి రికార్డులపై కన్నేసిన ఈ చిత్రం ఫస్ట్ డే ఎంత రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

తాజా సమాచారం ప్రకారం కాటమరాయుడు తొలి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లో 23.07 కోట్ల షేర్ (28 కోట్ల గ్రాస్) రాబట్టింది. దీంతో థర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి చివరకు మెగా రికార్డును కూడా క్రాస్ చేయలేకపోయింది. 23.28 కోట్లతో ఖైదీ నంబర్ 150 సెకండ్ ప్లేస్ లో ఉండగా, బాహుబలి మొదటి స్థానంలో ఉంది. అయితే నైజాంలో ఎర్లీ మార్నింగ్ షోలు కాన్సిల్ కావటం, కర్నూల్ లో నార్మల్ బుకింగ్ రేట్లకే టికెట్లను విక్రయించటంతో సుమారు 70 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. లేకుంటే ఫస్ట్ డే రికార్డులు బద్ధలయి ఉండేవంట.

ఉత్తరాంధ్ర, గుంటూరు, వెస్ట్ మరియు నెల్లూరులో ఆల్ టైం రికార్డులు నెలకొల్పాడు. మొత్తానికి ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో సత్తా చాటిన పవన్ వీకెండ్, పైగా పండగ సెలవు దినం కావటంతో ఫ్యామిలీస్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. మున్ముందు మరెన్ని రికార్డులు బద్ధలవుతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఏరియాల వారీగా కాటమరాయుడు కలెక్షన్లు...

Nizam 4.77 Cr
Ceded 2.98 Cr
UA 3.01 Cr (All Time Record)
Guntur 2.97 Cr (All Time Record)
East 3.56 Cr (All Time Record)
West 2.91 Cr
Krishna 1.52 Cr
Nellore 1.33 Cr (All Time Record)


Total 23.05 Cr (Share) (Gross 28.1 Crores).

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  First Day Collections  

Other Articles