తెలుగోళ్లను ఎలా ట్రీట్ చేస్తున్నాడో తెలుసా? | Mohanlal special care for Telugu Actors.

Mohanlal treatment for tollywood actors

Mohanlal, Mohanlal Special Care, Mohanlal Tollywood, Mohanlal Telugu Actors, Mohanlal Srikanth, Mohanlal Raashi Khanna, Raashi khanna Villain Movie, Raashi Khanna Srikanth Mollywood, Complete Actor Mohanlal

South Senior Hero Mohanlal introduced telugu stars in Mollywood. This Complete actor special care about those actors.

మోహన్ లాల్ కి టాలీవుడ్ ఎందుకంత స్పెషల్?

Posted: 03/27/2017 10:17 AM IST
Mohanlal treatment for tollywood actors

ప్రస్తుతం మళయాళంలోకి తెలుగు నుంచి వరుసగా వలసలు సాగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అక్కడ డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. అల్రెడీ అక్కడ భీభత్సమైన ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మంచి కథ దొరికితే డైరక్ట్ సినిమా చేసేందుకు రెడీ అని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అంతకన్నా ముందే మరో అల్లు వారసుడు శిరీష్ మాత్రం 1971 బియాండ్ బార్డర్స్ తో ముందుగానే అక్కడ ల్యాండ్ అయిపోతున్నాడు.

ఇక ఇప్పుడు శ్రీకాంత్ కూడా మాలీవుడ్ లో డెబ్యూ ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నాడు. సీనియర్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా విలన్ సినిమా ప్రస్తుతం రూపుదిద్దుకోబోతుంది. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేయబోతున్నాడు. రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొనేందుకు కొచ్చి వెళ్లిన శ్రీకాంత్ కు స్వయంగా మోహన్ లాలే స్వాగతం పలకటం ఇక్కడ విశేషం. తనను రిసీవ్ చేసుకోవటానికి వచ్చిన సూపర్ స్టార్ ను చూసి శ్రీకాంత్ షాక్ తోపాటు కాస్త ఎమోషనల్ అయ్యాడు.

Mohanlal special Srikanth

అల్రెడీ ఈ చిత్రంలో తెలుగు బ్యూటీ రాశిఖన్నా ఓ పోలీసాఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. తన ఫేస్ బుక్ లో ఈ విషయమై తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేసింది. మొత్తానికి తన సినిమాలతో తెలుగు వాళ్లను బాగా ఓన్ చేసుకోవటమే కాదు, వారికి అది సొంతిల్లు అన్న ఫీలింగ్ కలిగించేలా ఈ సీనియర్ హీరో తెగ ట్రై చేస్తున్నాడు. అన్నట్లు ఈ కంప్లీట్ యాక్టర్ పులిమురుగన్ తో జగపతిబాబును మాలీవుడ్ కు పరిచయం చేసింది తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mollywood  Telugu Actors  Mohanlal  

Other Articles