తొలి రోజు వసూళ్లు అదిరిపోయినా.. తొలుత పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు పవన్ త్వరపడకపోవటం, ఆపై అంతే స్పీడ్ తో నెగటివ్ టాక్ స్ప్రెడ్ కావటం కలెక్షన్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు 23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన కాటమరాయుడు రెండో రోజు కేవలం రూ.5.12 కోట్ల షేర్ తో సరిపెట్టుకున్నాడు. అయితే నిన్న ఆదివారం కావటంతో ఫ్యామిలీస్ మూలంగా మళ్లీ కలెక్షన్లు పెరుగుతాయని భావించినప్పటికీ పెద్ద పంచే పడింది.
ఇది ఈ సినిమా బయ్యర్లలో తీవ్ర ఆందోళన రేపేదే. రెండో రోజు కలెక్షన్లు తగ్గడం మామూలే కానీ.. మరీ ఈ స్థాయిలో డ్రాప్ ఊహించనిది. అడ్వాన్స్ బుకింగ్స్ వీకెండ్ మొత్తానికి అయిపోయాయని.. మూడు రోజులూ ‘కాటమరాయుడు’ హవా సాగడం ఖాయమని అనుకున్నారు కానీ.. అలా ఏమీ జరగలేదు. అన్ని ఏరియాల్లోనూ తొలి రోజు కోట్లల్లో వసూలు చేసిన కాటమరాయుడు రెండో రోజుకు లక్షల్లోకి వచ్చేశాడు. ఇక మూడో రోజు కాస్త మెరుగ్గుగా ఉండొచ్చని భావిస్తే దాదాపు రెండో రోజు లెక్క తేలటం డిస్ట్రిబ్యూటర్లకు కంగారు కలిగిస్తోంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో మ్యాట్నీ కన్నా ఫస్ట్ షోకి ఎక్కువ రెస్పాన్స్ ఉండొచ్చని భావించిన వారికి మరింత తక్కువ క్రౌడ్ రావటం షాకింగ్ అనే చెప్పుకోవాలి.
ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏకంగా 250 స్క్రీన్లలో ‘కాటమరాయుడు’ సినిమాను రిలీజ్ చేశారు. ఇది నాన్-బాహుబలి రికార్డు. దీంతో ఈ చిత్రం ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల వసూళ్లు కొట్టేస్తుందని ఆశించారు అభిమానులు. కానీ ప్రిమియర్లతో పాటు తొలి రోజు వసూళ్లను కలిపినా మిలియన్ డాలర్ల మార్కును అందుకోలేదు. గురు-శుక్రవారాలు రెండూ కలిపితే ఈ చిత్రానికి 6.67 లక్షల డాలర్లు వసూలయ్యాయంతే. సినిమా మీద ఉన్న హైప్.. రిలీజ్ చేసిన థియేటర్ల ప్రకారం చూస్తే ఇవి పూర్ ఓపెనింగ్సే. అందులోనూ సినిమాకు డివైడ్ టాక్ ఉన్న నేపథ్యంలో సినిమా అక్కడ ఫుల్ రన్లో మిలియన్ డాలర్ మార్కును దాటి ఎంతో దూరం ట్రావెల్ చేసేలా లేదు. కానీ అక్కడి బయ్యర్ సినిమాపై భారీ పెట్టుబడే పెట్టాడు. వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలబడకపోతే భారీ నష్టాలు తప్పవేమో. ఎందుకంటే ఈ వారం మరో ఐదు సినిమాలు రెడీగా ఉండగా, అందులో వెంకీ గురు లాంటి క్రేజీ ప్రాజెక్టు కూడా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ...
నైజాం (తెలంగాణ)-రూ.9.52 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.4.70 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.4.50 కోట్లు
తూర్పు గోదావరి-రూ.4.24 కోట్లు
గుంటూరు-రూ.3.80 కోట్లు
కృష్ణా- రూ.2.56 కోట్లు
పశ్చిమగోదావరి-రూ3.42 కోట్లు
నెల్లూరు-రూ.1.61 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి షేర్-రూ.34.35
వీకెండ్ లో ఇలా ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. మొత్తం సినిమా 115 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. సెకండాఫ్ అనుకున్నంత స్థాయిలో లేకపోవటం, పవన్ ప్రమోషన్లకు దూరంగా ఉండటం, పాటలు పెద్ద మైనస్ గా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఖైదీ నంబర్ 150 లాంటి యావరేజ్ కంటెంట్ తో వచ్చి చిరు చేసిన వండర్స్ తో కంపేర్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more