సీక్రెట్ రివీల్.. బాహుబలి చెప్పటంతోనే కట్టప్ప చంపేశాడు.. ఎలాగో చూడండి | Baahubali is the only reason for Kattappa killed him.

Finally kattappa killed baahubali secret revealed

WKKB, Kattappa Baahubali Kill, Baahubali Secret Revealed, Baahubali Killed Himself, Baahubali Real Secret Revealed, Baahubali said Kattappa Killed, Baahubali Killed Himself, Why Kattappa Killed Baahubali, Kattappa not Killed Baahubali, Baahubali Secret Reveal, Real Reason for Kattappa Killed Baahubali

Baahubali 2 trailer reveals why Kattappa killed Amarendra Baahubali.

కట్టప్ప సీక్రెట్ తెలిసిపోయిందా?

Posted: 04/15/2017 03:00 PM IST
Finally kattappa killed baahubali secret revealed

ఒక్క ప్రశ్న.. ఒకే ఒక్క ప్రశ్న... అమరేంద్ర బాహుబలిని రాజ విధేయుడు, సర్వసైన్యాధ్యక్షుడు కట్టప్ప ఎందుకు పొడిచి చంపాడు. రెండేళ్లుగా వీడని మిస్టరీ ఇది. కేవలం ఈ ఒక్క సమాధానం కోసమే యావత్ దేశం బాహుబలి ది కంక్లూజన్ పై ఆసక్తిని పెంచేసుకుంది. మరో 13 రోజుల్లో ఆ మిస్టరీ ఎలాగో వీడిపోబోతుంది. కానీ, ఇంతలో ఓ రెండు కథలు దానికి సంబంధించిందే నంటూ చక్కర్లు కొట్టడం, అది కాస్త దగ్గరి కంపేరిజన్ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బాహుబలి 2 ట్రైలర్ ను జాగ్రత్తగా గమనిస్తే మాషిష్మతి దేశ ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షణ కోసం అని అమరేంద్రుడు ప్రతిజ్న బూనుతాడు. దేవసేనకు దగ్గరై పదవీచ్యుతుడు అయ్యాక యుద్ధం సమయంలో బిజ్జలదేవుడు, భల్లాలుడు ప్రజలను బంధీ చేస్తే వారిని విడిపించేందుకే కట్టప్ప బాహుబలికి కత్తి దింపాడన్నది ఒకటి. ఇక అంతర్యుద్ధంలో భల్లాలదేవుడి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్న కారణంగా తమ సైనికులను చంపేస్తున్న బాహుబలిని వెన్నుపోటు పోడవమని స్వయంగా రాజమాత ఆదేశించటంతోనే.. అన్నది మరో కథ. ఏది ఏమైనా దేశ ప్రజల ప్రాణాల కోసమే తన ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమన్న మాట ప్రకారమే బాహుబలి చనిపోతాడన్నది ఓవరాల్ గా దీనిసారాంశం. ఆ లెక్కన్న బాహుబలి చెప్పటంతోనే జక్కన్న చంపాడన్నది వారు చెప్పేది.

 

మరోవైపు రాజమౌళి వైఫ్ రమా రాజమౌళి కూడా ఈ రెండేళ్లలో ఇప్పటిదాకా ప్రజలు గెస్ చేసిన దాంట్లో ఈ ట్విస్ట్లే బాగా నచ్చాయని, దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం అన్న మాట తోనే కట్టప్ప చంపాడన్నది చాలా దగ్గరగా ఉందని చెప్పటంతో బహుశా ఇదే కావొచ్చని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏది ఏమైనా జనం కోసం ప్రాణాలు ఇచ్చాడన్న కాన్సెప్ట్ మాత్రం ఎమోషనల్ గానే తెరపై ఉండబోతున్నది అర్థమౌతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2 Movie  Kattappa Kill  Secret Reveal  

Other Articles