రాండామూజమ్ నవల మహాభారతంలో పాండవుల కథ నేపథ్యంగా సాగే ఓ కథ. దీనినే 1000 కోట్ల బడ్జెట్ తో రైటర్ ఎంటీ వాసుదేవన్ నాయర్ సినిమాగా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. బీఆర్ శెట్టి దీనిని నిర్మిస్తుండగా, పాపులర్ యాడ్ మేకర్ శ్రీకుమార్ మీనన్ దీనికి దర్శకత్వం వహించబోతుండటం విశేషం.
అయితే సినిమాలో పాత్రలకు సంబంధించి ఓ క్లారిటీ లేకపోయినప్పటికీ, భీముని పాత్రకు ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్, భీష్ముడి రోల్ కు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఎంపిక చేశారు. అయితే భీముని పాత్రకు మోహన్ లాల్ ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాడు బాలీవుడ్ క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్. భీముని పాత్రకు మోహన్ లాల్ అస్సలు సూట్ కాడని.. చోటా బీమ్ లా ఉంటాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
మోహన్ లాల్ తో భీముని క్యారెక్టర్ చేయించడమంటే నిర్మాత డబ్బుల్ని వృధా చేసుకోవటమేనని కమల్ వ్యాఖ్యలు చేశారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేసినా.. మోహన్ లాల్ టీం మాత్రం అస్సలు రియాక్ట్ కాకపోవటం గమనార్హం. తరచూ వివాదాలతో విమర్శలు ఎదుర్కునే కమల్ కు మోహన్ లాల్ ను అనే అర్హత ఏ మాత్రం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే వాటికి కూడా కమల్ అదే రీతిలో ఆన్సర్ ఇచ్చుకున్నాడు.
People pls see this Chota Bheem. It will be a biggest insult of Bheem if this joker plays role of greatest Bheem. pic.twitter.com/9MhsEXMVq2
— KRK (@kamaalrkhan) April 19, 2017
Instead of abusing me you dumb fans of @Mohanlal should explain, what he was doing with his hand in a public function. He is shameless. pic.twitter.com/Bg4epAKYUs
— KRK (@kamaalrkhan) April 19, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more