వాళ్లిద్దరూ టాప్ కమెడియన్లు. ఇద్దరు కలిసి చేసిన పండించిన వినోదం అంతా ఇంతా కాదు. ప్రోఫెషనల్ గానే కాదు, రియల్ లైఫ్ లోనూ మంచి ఫ్రెండ్సే. కానీ, ఓ వివాదంతో బద్ధ శత్రువులుగా మారిపోయారు. కోలీవుడ్ కమెడియన్స్ వడివేలు, సింగముత్తుల గురించే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది.
గతంలో వీరిద్దరు కలిసి ఓ భూమిని కొన్నారు. తర్వాత దాని గురించి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. వడివేలుతో సింగముత్తు తాంబరం సమీపంలో కొంత స్థలాన్ని కొనిపించాడు. అయితే ఆ కొనుగోలుకు సంబంధించినవి నకిలీ దస్తావేజులని, సింగముత్తు తనను మోసం చేశాడని వడివేలు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా వీరిద్దరిని ఈ నెల 7న కోర్టుకు రావాల్సిందిగా న్యాయమూర్తి సూచించాడు.
అయితే వీరిద్దరు గైర్హాజరు కావటంతో ఆగ్రహించిన జడ్జి 20న హాజరు కావాల్సిందిగా ఆదేశించాడు. హాజరు కాని పక్షంలో వడివేలు, సింగముత్తులపై అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నట్లు హెచ్చరించాడు. దీంతో ఈ ఇద్దరు కమెడియన్లు తమ న్యాయవాదులతో హైకోర్టులో హాజరయ్యారు. కాగా, ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యేందుకు కూడా వీరిద్దరు ముందుకు రాకపోవటం విశేషం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more