TV Actor Pradeep commits suicide

Telugu tv avtor pradeep commit suicide

Actor Pradeep, TV Actor Pradeep, Actor Pradeep Suicide, T Actor Praddep Suicide, Saptha Matrika Actor Suicide, Saptha Matrika Pradeep, Actor Pradeep Death, Actor Pradeep Family, elugu TV Actor Death, Telugu Serial Actor Pradeep, Serial Pradeep Death, Pradeep Suicide, TV Actor Suicide, Small Screen Pradeep Suicide, Saptha Matrika, Pavani Reddy Pradeep, Saptha Matrika Fame Pradeep, TV Actor Pradeep Wife

Saptha Matrika Actor Pradeep commits suicide by Hanging. Police Confirmed Family Disputes behind suicide. Pradeep Now acting in Aaruguru Pathivrathalu and Saptapadi.

బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య

Posted: 05/03/2017 12:25 PM IST
Telugu tv avtor pradeep commit suicide

తెలుగు బుల్లితెరకు మరో విషాదం. సీరియల్ నటుడు ప్రదీప్ ఆత్మహత్య ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. బుధవారం ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మరో నటి పావని రెడ్డిని ఈ మధ్యే ప్రదీప్ వివాహం చేసుకున్నాడు.

నార్సింగ్ పీఎస్ పరిధిలోని అల్కాపురిలో గ్రీన్ హోమ్స్ అపార్ట్ మెంట్ లో నివసించే ప్రదీప్ నటన రంగం మీద ఇంట్రెస్ట్ తో మేకప్ వేసుకున్నాడు. తొలినాళ్లలో సైడ్ క్యారెక్టర్లతో కెరీర్ ను ప్రారంభించి మెల్లిగా లీడ్ రోల్స్ చేసే స్థాయికి చేరాడు. తొలుత డిప్రెషన్ కారణంగా భావించినప్పటికీ సప్త మాత్రిక సీరియల్ ద్వారా పాపులర్ అయిన ప్రదీప్, ప్రస్తుతం సప్తపది, ఆరుగురుపతివ్రతలు సీరియళ్లతో కెరీర్ లో బిజీ బిజీ గా ఉన్నాడు. 

సూసైడ్ కు గల కారణాలు స్పష్టంగా తెలీనప్పటికీ కుటుంబ కలహాలతోనే ఇలా చేశాడంటూ బంధువులు చెబుతుండగా పోలీసులు దాన్నే ధృవీకరిస్తున్నారు. 

 

మృతిపై అనుమానాలు...

 

ప్రదీప్ మృతి అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పెళ్లయిన కొన్ని రోజులకే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవటంతో కుటుంబ కలహాలే కారణమని సన్నిహితులు చెబుతుండగా, పావని మాత్రం తాము చాలా అన్యోన్యంగా ఉంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్ర‌దీప్ క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతున్న విషయాలు మాత్రం మరోలా ఉన్నాయి. ప్రదీప్ స్నేహితుడి మూలంగానే గొడవలు చెలరేగాయని వాళ్లు అంటున్నారు.

శ్రావణ్ అనే వ్యక్తి దుబాయ్ నుంచి ఆయ‌న‌ నాలుగు రోజుల క్రితం ఇక్క‌డ‌కు వ‌చ్చి, పావ‌ని, ప్ర‌దీప్‌లు ఉంటున్న ఇంట్లోనే ఉంటున్నాడ‌ని వారు చెబుతున్నారు. శ్రావ‌ణ్ త‌న బ‌ర్త్ డే పార్టీని నిన్న అర్ధ‌రాత్రి చేసుకున్నాడు. శ్రావణ్‌తో చనువుగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ ఫొటోను పావని తన మొబైల్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుంద‌ని, దీంతో ప్ర‌దీప్ పావ‌నితో గొడ‌వ ప‌డ్డాడ‌ని తెలిపారు. ప్రదీప్ సూసైడ్ నోట్ కూడా రాయకుండా ఆత్మహత్య చేసుకోవ‌డం ఏంట‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

శ్రావణ్, పావని కలిసే ప్రదీప్‌ను హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రదీప్ బాటిల్‌తో త‌న తలపై గ‌ట్టిగా కొట్టుకోగా, ఆ గాజు ముక్కలను పనిమనిషితో పావని తీయించింద‌ని స్థానికులు అంటున్నారు. మృతదేహం మంచం కింద ఉండటంపై కూడా ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sapta Matrika Serial  Actor Pradeep  Suicide  

Other Articles