వల్గర్ పదాలు ఇండియన్ మూవీస్ లో వినిపించటం చాలా తక్కువ. ఏదో ఢిల్లీ బెల్లీ, ఉడ్తా పంజాబ్ లాంటి సినిమాలు సెన్సార్ నుంచి తప్పించుకోగలిగాయి గానీ, మిగతా సినిమాల్లో మాత్రం ఆ పదాల ప్లేస్ లో బీప్ లు వాడటం చూస్తుంటాం.
కానీ, హాలీవుడ్ లో ఇలాంటి పదాలు చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. అయితే ఆ డోస్ శృతి మించితే మాత్రం వెంటనే వాటికి ఆర్ రేటింగ్ ఇచ్చేస్తారు. అది సినిమా విషయంలోనే కాదు.. టీజర్, ట్రైలర్ల లకు కూడా. ప్రియాంక హాలీవుడ్ మూవీ బేవాచ్ విషయంలోనూ ఇప్పుడు అదే జరిగింది. ఈ చిత్ర కొత్త ట్రైలర్ ను రిలీజ్ చేయగా దాని నిండా పచ్చి బూతులతో నింపేశారు. ముఖ్యంగా ఎఫ్* ఆ* ... అంటూ కొనసాగిన పదాల పర్వానికి హద్దే లేకుండా పోయింది.
డ్వానె జాన్సన్ అదేనండీ రెజ్లింగ్ స్టార్ రాక్ లీడ్ రోల్ పోషిస్తున్న పూర్తిగా కామెడీ కమ్ యాక్షన్ సీక్వెన్స్ తో ట్రైలర్ ను నింపేశారు. అంతా బాగానే ఉన్నా విలన్ రోల్ చేస్తున్న మన ప్రియాంకను కూడా మళ్లీ ఈసారి టీజర్ లో మళ్లీ తక్కువసేపే చూపించేశారు. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బేవాచ్ సీరియల్ ఆధారంగానే రూపొందిన ఈ చిత్రం మే 25న విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more