actress vanitha reacts on her daughter kidnaping allegations కూతురు కిడ్నాప్ కేసులో నటి సంచలన వ్యాఖ్యలు

Actress vanitha reacts on her daughter kidnaping allegations

actress vanitha kidnaping allegations, actress vanitha reacts on allegations, actress vanitha daughter kidnap, actress vanitha daughter kidnaping allegations, actress vanitha anand raj, actress vanitha anand raj allegations, actress, vanitha, anandraj, businessman, daughter, yajanita, kidnap, tollywood latest news, kollywood latest news

actress vanitha reacts on her daughter kidnaping allegations, says she will face all the false allegations put by her ex husband anand raj in the court of law.

కూతురు కిడ్నాప్ కేసులో నటి సంచలన వ్యాఖ్యలు

Posted: 05/20/2017 11:55 AM IST
Actress vanitha reacts on her daughter kidnaping allegations

తన కూతుర్ని కిడ్నాప్‌ చేసిందంటూ మాజీ భర్త ఆనంద్‌రాజ్‌ చేస్తున్న అరోపణలు నిద్వందంగా కొట్టిపారేసింది నటి వనిత. తెలుగు, తమిళ సినీవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంపై అమె స్పందంచింది. తన మాజీ భర్త చేస్తున్న అరోపణల్లో అసలు నిజం లేదని చెప్పింది. సీనియర్‌ నటుడు విజయకుమార్, మంజుల కూతరైన వనిత.. తన కూతురు తనకు ఫోన్ చేసి.. తనను తీసుకువెళ్లమని అంటేనే తాను పోలీసులు సాయంతో అమెను తీసుకువచ్చానని చెబుతోంది.

కాగా తన రెండో భర్త వ్యాపారవెత్త అయిన ఆనంద్ రాజ్.. తన కూతురిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు పిర్యాదు చేయండం.. అమె కోసం హైదరాబాద్ పోలీసులు చెన్నైకి వెళ్లడం, అక్కడ అమె లేకపోవడం తెలిసి వెనక్కు రావడం అన్ని జరిగిపోయాయి. దీంతో ఈ అంశమై స్పందించిన వనిత.. తన కూతురును తానే ఎందుకు కిడ్నాప్ చేస్తానని ప్రశ్నించింది. ఆనంద్‌రాజ్‌ నుంచి విడాకులు పొందాక అతని అడ్రస్‌ కూడా తనకు తెలియదని, అయితే కూతరు యజనితను కూడా ఆనంద్ రాజే తీసుకెళ్లాడని తెలిపింది.

ఆనంద్‌రాజ్‌ కూతురికి తన గురించి కూతురుకు లేనిపోని విషయాలను అనందరాజ్ నూరి పోశాడని అయితే తండ్రి మాటలు విశ్వసించని తన కూతరు ఎంతో మదనపడిందని తెలిపింది. తన కూతురు గురించి తాను ఎప్పటికప్పుడు ఈ మెయిల్ ద్వారా తెలుసుకునే దానినని చెప్పింది. ఈ మెయిల్‌ ద్వారా తన ఫోన్‌ నెంబర్‌ తెలుసుకున్న జయనిత తండ్రి దగ్గర నుంచి తనను తీసుకెళ్లమని అభ్యర్ధించిందని తెలిపింది.

దీంతో తాను హైదరాబాద్‌ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసి, వారితోపాటు ఆనంద్‌రాజ్‌ ఇంటికి వెళ్లి కూతురిని తీసుకొచ్చానని ఇది కిడ్నాప్‌ ఎలా అవుతుందని లమె ప్రవ్నించింది. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే లేనిపోని విషయాలను కల్పిస్తున్నారని అమె అరోపించింది. ప్రస్తుతం తాను వేరే ప్రాంతంలో ఉన్నానని, తన కూతురు కోసం అరెస్ట్‌ అవడానికి ఎప్పుడూ తాను సిద్ధమేనన్నారు. అయితే దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని.. చంద్రలేఖ, మాణిక్యం చిత్రాలలో నాయిక పాత్రలలో నటించిన నటి వనిత తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : actress  vanitha  anandraj  businessman  daughter  jayanitha  kidnap  tollywood  kollywood  

Other Articles