Tubelight Trailer Compared with Bajrangi Bhaijaan's line

Salman khan tube light trailer review

Salman Khan, Salman Khan New Trailer, Salman Khan Tubelight Movie, Tubelight Trailer Review, Tubelight Review, Tubelight railer Bajrangi Bhaijaan, Tubelight Similar Story, Tubelight Trailer Review, Tubelight Highlights, Tubelight Trailer Negatve

Salman Khan Tubelight Trailer Released. Salman acting as Laxman impressive. But, Trailer compared with Bajrangi Bhaijaan.

సల్మాన్ ట్యూబ్ లైట్ ట్రైలర్ రివ్యూ

Posted: 05/26/2017 02:50 PM IST
Salman khan tube light trailer review

బాలీవుడ్ సీరియల్ బ్లాక్ బస్టర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేసి పడేస్తున్నాడు. ట్యూబ్ లైట్ ట్రైలర్ యూట్యూబ్ లో ప్రభంజనంలా దూసుకుపోతుంది. 24 గంటలు గడవక ముందే హాఫ్ మిలియన్ దిశగా దూసుకుపోతుంది.

ఏక్ థా టైగర్, భజిరంగీ భాయ్ జాన్ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ ట్యూబ్ లైట్ ను రూపొందించిన విషయం తెలిసిందే. 1962 ఇండో చైనా వార్ సమయంలో బందీ అయిన తన సోదరుడిని విడిపించుకునేందుకు ఓ అమాయకపు వ్యక్తి చేసే యత్నమే ట్యూబ్ లైట్ కథ. ఇక ట్రైలర్ విషయానికొస్తే... ప్రతీ ఫ్రేమ్ లో తన ఇన్నోసెన్స్ ఫెర్ ఫార్మెన్స్ తో కట్టిపడేశాడు సల్లూ భాయ్. వార్ సన్నివేశాలను కూడా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించే యత్నం చేశాడు కబీర్.

 

ఇక చిత్రంలో ఇంకో హైలెట్ గా చెప్పుకుంటున్న షారూఖ్ లుక్కును ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ, ఒక ఫ్రేమ్ లో మాత్రం షారూఖ్ క్యారెక్టర్ షాడోను మాత్రం చూపించేశాడు. ఓవరాల్ గా లక్ష్మణ్ అలియాస్ ట్యూబ్ లైట్ రోల్ లో సల్మాన్ ఖాన్ నటన హైలెట్ గా నిలిచే ఛాన్సు ఉంది. అయితే ట్రైలర్ పై ఎంత పాజిటివ్ రియాక్షన్ వస్తుందో నెగటివ్ కామెంట్లు కూడా అంతే పడుతున్నాయి. కబీర్ భజిరంగీ బాయ్ జాన్ లాగానే దీనిని తీసాడని, అక్కడ పాప బదులు ఇక్కడ సోదరుడిని పెట్టాడంటూ ఇలా పోలికలతో కామెంట్లు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Tubelight Movie  Trailer Review  

Other Articles