actress apoora on chalapathi rao comments చలపతిరావుకు బాసటగా నిలిచిన అపూర్వ

Actress apoora on chalapathi rao comments

apoorva sensational comments on tollywood, actress apoorva defends chalapathi rao, actress apoorva womenisers, actress apoorve sensational comments, actress apoorve emotional, chalapathi rao, apoorva, sensational comments, emotional, womenisers, tollywood

Actress Apoorva says Chalapathi Rao comments are unfortunate but he made those comments on funny and satirical base, she became emotional and tried to defend Chalapathi Rao citing some examples.

బ్రేక్ లో గదిలోకి రమ్మనే కామాంధులున్నారు.. బాబాయ్ మంచోరు..

Posted: 05/28/2017 11:54 AM IST
Actress apoora on chalapathi rao comments

సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్లంటే ఎంతో గౌరవమని, అయితే అతను మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కేవలం సరదా వ్యాఖ్యలే తప్ప.. నిజంగా వారిపట్లు అనుచిత వైఖరితో మాత్రం కాదని క్యారెక్టర్ అర్టిస్ట్ నటి అపూర్వ అన్నారు. ఆయన కొవ్వుతోనో, కామంతోనో అలా అనలేదని అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ సరదాగా, ఫన్నీగా మాట్లాడుతూ ఉండే చలపతిరావు వద్దకు మైక్ పట్టుకుని ఆమె వెళ్తుంటేనే, బాబాయ్ ఏమనేస్తారో? అని భయపడ్డానని, టప్ మని ఆయన అనేశారని, అది నోరు జారి చేసిన వ్యాఖ్యేనని చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా అమె తెలుగు ఇండస్ట్రీలోని సంచలన విషయాలను వెల్లడించారు. ఎంతో మంది తాతయ్యల వయసులో ఉన్న వారు అమ్మాయిలను పక్కన కూర్చో బెట్టుకుని, వాళ్ల మీద చేతులు వేసి కబుర్లు చెబుతూ, విరామ సమయంలో గదిలోకి రమ్మని ఆదేశించే వాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పింది. వాళ్లతో పోల్చితే బాబాయ్ చలపతిరావు దేవుడి వంటి వాడని చెప్పింది. చలపతిరావు గురించి కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వేళ, ఆయన మంచి మనసు ఎట్లాంటిదో కొంతమందైనా బయటకు వచ్చి చెబితే బాగుంటుందని సలహా ఇచ్చింది.

ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఆయన చాలా మంచివాడని చెబుతారని, చలపతిరావు తమకు దేవుడని ఉద్వేగంతో చెప్పుకొచ్చింది. చలపతిరావును బాయ్ కాట్ చేయాలని, ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని అనడం తగదని, ఆయనేమీ ఉగ్రవాది కాదని చెప్పింది. తనతో సహా, ఇండస్ట్రీలోని అందరితో ఆయనెంతో సరదాగా ఉంటారని, ఎవరితోనూ ఒక్కసారి కూడా మిస్ బిహేవ్ చేయలేదని వెల్లడించింది. 'ఆత్మహత్యాయత్నం చేసిన చలపతిరావు' అంటూ వచ్చిన ఫేక్ న్యూస్ విని తన కళ్లలో నీళ్లు వచ్చాయని అపూర్వ చెప్పింది. మరి అపూర్వ వ్యాఖ్యల నేపథ్యంలో చలపతి రావు ఎఫిసోడ్ ముగిసిపోతుందా..? లేక కొత్త టార్న్ తీసుకుంటుందా..? అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chalapathi rao  apoorva  sensational comments  emotional  womenisers  tollywood  

Other Articles