Posani Charges Bomb for NTR Debut

Posani offered shocking remuneration for bigg boss

Posani Krishna, Posani Krishna Bigg Boss Show, NTR Posani Bigg Boss, Telugu Bigg Boss Contestants, Bigg Boss Show, Bigg Boss Contestants, Bigg Boss Posani, Posani 2.5 Crores Remuneration, Posani Bigg Boss Remuneration

Posani Krishna Murali Charges bomb for Telugu Bigg Boss Show . The makers of Show ready to pay2.5 Crores as remuneration for Mental tagline Actor.

బిగ్ బాస్ కోసం పోసానికి భారీ ఆఫర్

Posted: 06/24/2017 11:23 AM IST
Posani offered shocking remuneration for bigg boss

ఓవైపు బుల్లితెర షో యారీ నంబర్ 1 విత్ రానా మొదలయ్యే టైం దగ్గర పడింది. దానికంటే ముందే ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడింది. అయినా అల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోవటంతో రానానే ముందు తన డెబ్యూ చేయబోతున్నాడు. మరి బిగ్ బాస్ కు ఎందుకంత ఆలస్యం జరుగుతోంది.

కాంట్రవర్సీ షోగా పేరున్న బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ లుగా చేసేందుకు మాములుగా అయితే మూవీ, స్మాల్ స్క్రీన్ లేదా వివాదాస్పద వ్యక్తులను తీసుకుంటారు. పైగా కొన్ని రోజుల తరబడి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఈ కారణంగా ఇందులో నటించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని సమాచారం. దీంతో రంగంలోకి దిగిన షో నిర్వాహకులు రెమ్యునరేషన్ ను ఆఫర్ చేస్తున్నారంట. ఇందులో భాగంగా పోసాని కృష్ణమురళిని రప్పించబోతున్నారని తెలుస్తోంది.

అయితే వరుస సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే పోసాని అందుకు తొలుత విముఖత వ్యక్తం చేశాడంట. కానీ, 2.5 కోట్ల భారీ పారితోషకంగా ఇస్తామని చెప్పటంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కాబోతుండగా, మధుషాలిని, తేజస్వి మదివాడ లాంటి సెకండ్ కేటగిరీ హీరోయిన్లకు కూడా ఇన్విటేషన్లు అందినట్లు తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Posani  NTR  Bigg Boss Show  

Other Articles