Junior NTR Jai Lakusa Postponed due to Balayya

Abbai sacrifice this time for babai

Junior NTR, Jai Lavakusa, Jai Lavakusa Postponed, Jai Lavakusa Paisa Vasool, Paisa Vasool Postponed, NTR Jai Balayya, NTR Sacrifice for Balayya, Kalyan Ram Jai Lavakusa Release Date, Jai Lavakusa Date CHange

Junior NTR not want to fight with Babai Balakrishna. Jai Lavakusa may postponed for two weeks Line Clear for Paisa Vasool.

పైసా వసూల్ కోసం జూనియర్.. నిజమేనా?

Posted: 06/27/2017 06:33 PM IST
Abbai sacrifice this time for babai

టాలీవుడ్ లో బిగ్ సీజన్ గా భావిస్తున్న సెప్టెంబర్ రేసు నుంచి సినిమాలు డ్రాప్ అవుతున్నాయి. నేనే రాజు నేనే మంత్రి, జవాన్లు ఇప్పటికే తమ రిలీజ్ డేట్లు మార్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహేష్ స్పైడర్ కూడా దీపావళికి వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో జస్ట్ నందమూరి హీరోల సినిమాల మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు ఆ సీన్ కూడా మారే ఛాన్స్ ఉన్నాయని వార్త అందుతోంది.

ఎన్టీఆర్ బాబీ డైరక్షన్ లో రాబోతున్న 'జై లవ కుశ' సినిమా రిలీజ్ డేట్ మారనుందనేది ఆ వార్త సారాంశం. నిజానికి సెప్టెంబర్ 21న విడుదల నిర్మాత కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారు. అయితే తర్వాతి వారమే అంటే 29న బాలకృష్ణ 'పైసా వసూల్' సినిమా రిలీజ్ వుంది. దీంతో బాబాయ్ తో పోటీపడటం ఇష్టం లేక ఈసారి వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారం లేదా రెండు వారాలు ముందుకు జరిపి జై లవకుశ రిలీజ్ అయ్యే ఛాన్సు ఉందంట.

రెండు పెద్ద సినిమాల రిలీజ్ మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండటం, వసూళ్లపై ప్రభావం చూపించే ఛాన్స్ వుంది. పైగా నిర్మాత అయిన గత చిత్రాలు ఫ్లాపులు కావటంతో ఈసారి అంత రిస్క్ చేసేందుకు ముందుకు రావటం లేదని టాక్. ఇంతకు ముందు నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ లు గతేడాది సంక్రాంతి బరిలో నిలవటం తెలిసిందే. సో... ఆ లెక్కన్న జై లవకుశ ఆల్ మోస్ట్ వాయిదా పడ్డట్లే. రాశీఖన్నా, నివేదా థామస్, నందితారాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్, అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lavakusa  Balakrishna  Paisa Vasool  

Other Articles