Kavya Madhavan Scape Goat in Bahavana Case

Kavya madhavan involvement in bhavana case

Actress Bhavana, Bhavana Molestation Case, Bhavana Case, Bhavana Kavya Madhavan, Dileep Wife Kavya Bhavana, Kavya Bhavana Case, Actress Molestation, Bhavana Kavya Madhavan, Kavya Madhavan Mother Bhavana Case

Actress Bhavana abduction and molestation case turns murkier. Kavya Madhavan's mom will be interrogated. Raid in Kavya's office in search of memory card.

భావన కేసులో కొత్త వాదన.. కావ్యాను ఇరికిస్తున్నారా?

Posted: 07/04/2017 09:08 AM IST
Kavya madhavan involvement in bhavana case

సినీ నటి భావనపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో సరికొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన నిందితుడు పల్సర్ సునీని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించడంతో జైళ్లోనే ఉన్నాడు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా మలయాళ స్టార్ హీరో దిలీప్‌ ను సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. దీలీప్ భార్య(రెండో), నటి కావ్య మాధవన్ ఇల్లు, కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపుతోంది.

వ్యాపార కార్యకలాపాల రికార్డులు, బ్యాంకు పేమెంట్స్‌ గురించి కూడా పోలీసులు ఆరా తీశారు. భావనపై వేధింపులకు పాల్పడిన అనంతరం ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్‌ సునీ రెండుసార్లు కావ్య మాధవన్ కార్యాలయానికి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భావనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీసిన వీడియో, ఫొటోల మెమరీ కార్డును కావ్య మాధవన్ ఆఫీస్‌లో దాచి పెట్టిఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మొదటి భార్యకు విడాకులిచ్చిన దిలీప్ 2016లో కావ్యామాధవన్ ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని, మొదటి భార్యకు విడాకులివ్వడాన్ని భావన తీవ్రంగా వ్యతిరేకించింది.

దిలీప్, భావన కలసి పలు సినిమాల్లో కలిసి నటించారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సమయంలో వారి మధ్య అఫైర్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. అందుకే, దిలీప్ రెండో వివాహాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలోనే భావనపై లైంగిక వేధింపులు జరగగా, దిలీప్ ప్రోద్బలంతోనే పల్సర్ సునీ ఇదంతా చేశాడని కథనాలు వెలువడ్డాయి. మరోపక్క భావన, దిలీప్ లు ఇప్పుడు ఏకమై కావ్యను వదిలించుకునే యత్నం చేస్తున్నారన్న వాదనను తెరపైకి తెస్తున్న వారూ ఉన్నారు. కావ్య తల్లిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhavana  Kavya Madhavan  Molestation Case  

Other Articles