A Biopic on Darsaka Ratna Announced

Get ready dasari biopic

Dasari Biopic, Darsaka Ratna Biopic, Darsaka Ratna Movie, Darsaka Ratna Life Silver Screen, Dasari Movie, O Kalyan Dasri Biopic, Dasari Biopic Hero, Dasari Movie Hero, Dasari Biopic Name, Dasari Biopic Director

Tollywood Legendary Director Dasari Narayana Rao Life on Silver Screen. His Disciple O Kalyan Announces Dasari Biopic. Full details reveal soon.

దాసరిపై మూవీ.. హీరోగా ఎవరు చేస్తారు?

Posted: 07/06/2017 12:01 PM IST
Get ready dasari biopic

బయోపిక్ ల ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కి పాకిపోయింది. మహానటి సావిత్రి, లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ఇలా సెలబ్రిటీల జీవిత గాథలను సినిమాలుగా తెరకెక్కించే ప్రయత్నాలను ముమ్మరం చేసేశారు. దివంగత నటి జయలలిత జీవితగాథను తెరకెక్కించేందుకు లెజెండరీ దర్శకుడు దాసరి ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. కానీ, ఇంతలోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

అయితే సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన దర్శకరత్న బయోపిక్ నే ఇప్పుడు సినిమా తీయబోతున్నారు ఆయన శిష్యులు. ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు, నటుడు ఓ.కల్యాణ్ మరికొందరితో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నాడంట. దీనిపై ఓ అఫీషియల్ ప్రకటన కూడా వెలువరించాడు. దాసరి వద్ద శిష్యరికం చేసిన ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్టు
తెలుస్తోంది.

నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా... 150 సినిమాలు తీసిన ఆ మహానుభావుడికి జీవిత గాథను చిత్ర రూపంలో తెరకెక్కించి ఘన నివాళి అర్పిస్తామని కల్యాణ్ చెబుతున్నాడు. సినీ ప్రస్థానంతోపాటు రాజకీయ జీవితాన్ని కూడా ఇందులో చూపించబోతున్నారంట. చిన్న సినిమాల కోసం ఆయన చేసిన పోరాటాలు, ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన ఘన విజయాలు ఇలా అన్నీ ఉండబోతున్నాయంట.

అంతా బాగానే ఉన్నా.. ఆ పాత్రకు సూటయ్యే ఆహార్యం ఉన్న నటుడు ఎవరబ్బా అన్నదే ఇప్పుడు హాట్ డిస్కషన్ గా మారింది. దాసరి లైఫ్ లో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. పలు స్టేజీల మీద ఆయన ఓ వర్గ హీరోలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన దాఖలాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ చివరి రోజుల్లో అందరితో ఆయన బాగానే ఉన్నారనుకోండి. అయినప్పటికీ దాసరి క్యారెక్టర్ ఛాలెజింగ్ పాత్ర కావటంతో దాని పోషించే సత్తా ఉన్న నటుడి కోసం ఇప్పుడు అన్వేషణ మొదలైంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  Biopic  Tollywood News  

Other Articles