Nani Ninnu Kori Opening Day Collections Report

Nani ninnu kori opening collections

Nani, Nani Ninnu Kori, Ninnu Kori First Day Collections, Nani Ninnu Kori Movie, Nani First Day Collections, Nani Ninnu Kori Collections, Ninnu Kori Overseas Collections, Nani Ninnu Kori Million Dollar Club, Nani Ninnu Kori telugu States COllections, Ninnu Kori Movie Box Office Report

Nani Ninnu Kori Movie Opening Day Collections. Total 10 Crores Grosser and 4.49 crores in only telugu states only, but not overcome Eega(4.60 Cr) due to GST New Rules.

నిన్ను కోరి ఫస్ట్ డే కలెక్షన్లు.. జీఎస్టీతో దెబ్బ, అయినా...

Posted: 07/08/2017 03:50 PM IST
Nani ninnu kori opening collections

నేచురల్ స్టార్ నాని నటించిన నిన్ను కోరి సినిమాకు ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ వచ్చేసింది. కెరీర్ లోనే నాని ది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ఇచ్చాడంటూ క్రిటిక్స్ కూడా పొగడ్తలతో ముంచెత్తారు. ఓవరాల్ గా సినిమాకు మాత్రం మనసు లోతుల్లోకి చొచ్చుకుపోయే ఓ అందమైన ప్రేమకథ అంటూ తీర్పు ఇచ్చేశారు. అయితే సినిమా టాక్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు కావాల్సింది కలెక్షన్ల లెక్క గురించి...

ఫస్ట్ డే ఈ సినిమా రాబట్టిన కలెక్షన్లు ఎంతో ఇప్పుడు చూద్దాం. టోటల్ గ్రాస్ 10 కోట్లకు పైగానే సాధించి, నేను లోకల్ రికార్డును బద్ధలు కొట్టేసింది. ఇక తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4.49 కోట్ల షేర్ ను రాబట్టేసింది. నాని కెరీర్ లో ఇదే సెకండ్ హయ్యెస్ట్. ఇంతకు ముందు ఈ రికార్డు రాజమౌళి ఈగ పేరు మీద ఉంది(4.60 కోట్లు). అఫ్ కోర్స్ రాజమౌళి సినిమా కాబట్టి దానిని పక్కన పెడితే మాత్రం ఇప్పటిదాకా ఇదే నాని కెరీర్ లో హయ్యెస్ట్ అన్నమాట. అయితే జీఎస్టీ మూలంగా విధించిన టాక్స్ రూల్స్ తో కలెక్షన్లకు పెద్ద దెబ్బే పడినట్లయ్యింది.

ఓవర్సీస్ లో కూడా సినిమాకు భారీ స్పందన వచ్చింది. అయితే కలెక్షన్ల లెక్క మాత్రం ఇంకా తేలలేదు. 1.7 లక్షల డాలర్లను కొల్లగొట్టిందని, మిలియన్ డాలర్ల క్లబ్ కి చేరువైందని చెబుతున్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. సినిమా సుమారు 20 కోట్ల దాకా బిజినెస్ చేసింది. మౌత్ టాక్ తో ఈ వీకెండ్ లో ఊపు కొనసాగుతుంది. ఆ లెక్కన మరో వారంలో లాభాల్లోకి ఎంటర్ అయిపోతుంది. మొత్తానికి నాని తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ తో మరోసారి నిర్మాతలకు లాభాల పంటే పండించబోవటం ఖాయమైంది.

 

ఏపీ తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్లు(షేర్ రూపంలో)


Nizam               1.69 Cr
Ceded               0.57 Cr
UA                    0.58 Cr
Guntur              0.40 Cr
East                  0.45 Cr
West                 0.32 Cr
Krishna              0.36 Cr
Nellore               0.21 Cr

Total                  4.49 Cr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori Movie  First Day Collections  

Other Articles