NTR Small Screen Debut Effect on Jai Lava Kusa

Ntr jai lava kusa delay

Jai Lava Kusa, Jai Lava Kusa Delay, Jai Lava Kusa Bigg Boss, NTR's Bigg Boss, NTR jai lava kusa delay, Jai Lava Kusa Postponed, Jai Lava Kusa Release Date

Jai Lava Kusa Delayed with NTR's Bigg Boss Commitment. But, Sources says there is no clash between these projects.

బిగ్ బాస్ ఎఫెక్ట్.. జైలవకుశకు ప్రాబ్లమ్?

Posted: 07/13/2017 03:49 PM IST
Ntr jai lava kusa delay

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఓవైపు సినిమాతోపాటు మరోపక్క టీవీ రియాల్టీ షోతో పలకరించేందుకు రెడీ అయిపోయాడు. ఈ నెల 16 నుంచే బిగ్ బాస్ షో ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఫస్ట్ టైం బుల్లితెరపై ఎలా అలరించబోతున్నాడో అని ఫ్యాన్స్, సీనియర్ హీరోలను బీట్ చేయగలడా? అని తెలుగు ఆడియన్స్ ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే రెండు పడవల మీద ప్రయాణానికే ఎన్టీఆర్ మొగ్గు చూపుతున్నాడు. బిగ్ బాస్ ఇంట్రో షూటింగ్ ఎపిసోడ్స్ మాత్రమే ఇప్పటికి పూర్తయ్యింది. దాదాపు 70 రోజులపాటు జరిగే షో కు అందుబాటులో ఉండాలి. అదే సమయంలో సెప్టెంబర్ చివరి కల్లా సినిమా రిలీజ్ కావాల్సిందే. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తాడన్నది అనుమానంగా మారింది. అయితే డైరక్టర్ బాబీని ఈ విషయంలో ముందుగానే ఒప్పించేశారంట నందమూరి బ్రదర్స్.

షూటింగ్ కు ఏ మాత్రం అంతరాయం జరగకుండా ఇప్పటికే షెడ్యూల్ ఫ్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు చివరి వారం కల్లా టాకీ పార్ట్, సెప్టెంబర్ రెండో వారంలోపు మొత్తం షూటింగ్ అయిపోయేలా డేట్లు అడ్జట్ చేసి, మరోపక్క బిగ్ బాస్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. ఆ లెక్కన జైలవకుశకు బుడ్డొడి బుల్లితెర ఎంట్రీ ఎలాంటి అడ్డుకాబోదన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jai Lava Kusa  NTR  Bigg Boss Show  

Other Articles