డ్రగ్స్ రాకెట్ పై దిల్ రాజు రియాక్షన్ | Star Producer Don't know anything about Drug Case

Dil raju on dj collections

Dil Raju, Dil Raju DJ Collections, Dil Raju Drug Case, Dil Raju warn Pawan Fans, Dil raju Clear Air, Dil raju Interview

Producer Dil Raju clarity on DJ movie real collections. No Need to show fake collections. Don't know anything about Drug Case he added.

డీజే కలెక్షన్లు, డ్రగ్స్ కేసు పై ఏం చెప్పాడు?

Posted: 07/18/2017 03:08 PM IST
Dil raju on dj collections

బన్నీ డీజే కలెక్షన్ల విషయంలో జరుగుతున్న వివాదం అంతా ఇంతా కాదు. ఆ మధ్య ఖైదీ నంబర్ 150 రికార్డులను డీజే దాటేసిందని న్యూస్ వైరల్ అవ్వగానే, నిర్మాత దిల్ రాజు ఆఫీస్ పై దాడి జరగటం, తర్వాత తాను ఆ ప్రకటన చేయలేదని క్లారిటీ ఇవ్వటం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మరోసారి మీడియా ముందుకు వచ్చిన రాజు రాంగ్ స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటూ చెబుతూనే ఓ హీరో ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశాడు.

అల్లు అర్జున్ కెరీర్ లో 'సరైనోడు' చిత్రం కలెక్షన్లే ఇప్పటివరకూ అధికమని, దాన్ని దాటిన తరువాతనే 'డీజే-దువ్వాడ జగన్నాథం' చిత్రం హిట్ అని తాను ప్రకటించానని మరోసారి తెలిపాడు. ఓ హీరో సినిమాపై ఇలాంటి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే, మరో హీరో నుంచి ఇలాంటి చిత్రం వచ్చినప్పుడు, ఇదే సమస్య వస్తుందంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. ఓ హీరో సినిమా నాశనం అవ్వాలనే పద్ధతి మంచిది కాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. విష సంస్కృతిని పెంచకుండా హీరోలు తమ తమ అభిమానులను కట్టడి చేయాలని సూచించాడు. దీంతో ఆ హీరో ఎవరా? అన్న డౌట్లు మొదలయ్యాయి.


నేను నిర్మాతనే కాదు.. డిస్ట్రిబ్యూటర్ ను కూడా. ఆ దెబ్బలు ఏంటో నాకూ తెలుసు. అలాంటప్పుడు కలెక్షన్ల ప్రకటనలో ఖచ్ఛితంగా ఉంటానంటూ చెప్పుకొచ్చాడు. తప్పుడు ప్రకటనలు చేస్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లే అని తెలిపాడు. ఇక టాలీవుడ్ ను కుదిపేస్తున్న మాదకద్రవ్యాల వ్యవహారంపై మాట్లాడుతూ, దానిపై తనకు పూర్తి వివరాలు తెలియవని అన్నారు. డీజే విడుదల తరువాత తాను అమెరికాకు వెళ్లిపోయానని, హైదరాబాద్ లో ఏం జరిగిందన్న సంగతి తెలియదని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  DJ Movie  Fake Collections  Tollywood Drug Case  

Other Articles