చస్తానని బెదిరించటంతోనే సంపూ ఎలిమినేషన్ ? | Burning Star threatened to Commit Suicide in Bigg Boss

Sampoornesh babu eliminated from bigg boss house

Sampoornesh Babu, Sampoo Bigg Boss Show, Sampoo Eliminate, Sampoornesh Bigg Boss Exit, Sampoo Re Entry, Sampoo Commit Suicide Bigg Boss, Bigg Boss Telugu Elimination, Sampoo Self Elimination, Sampoo Behaviour in Bigg Boss House, Sampoo Scold Bigg Boss

Burning Star Sampoornesh Babu Eliminated Himself From Bigg Boss House. Threatened to commit suicide to Bigg Boss?.

సంపూ ఎలిమినేషన్.. అసలేం జరిగింది?

Posted: 07/26/2017 09:47 AM IST
Sampoornesh babu eliminated from bigg boss house

బిగ్ బాస్ రియాలిటీ షోలో సెకండ్ ఎలిమినేషన్ అయిపోయింది. నటి జ్యోతి ఫస్ట్ ఎలిమినేట్ కాగా, సినీ నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశపరుస్తూ ఎలిమినేట్ అయ్యాడు. ఏకంగా బిగ్ బాస్ ను తిట్టేస్తూ బయటకు వచ్చేశాడు. నాలుగు గదుల మధ్య బంధీ వాతావరణం తనకు నచ్చలేదని, ఉండలేకపోతున్నానని ఒకానోక టైంలో ఆవేశానికి లోనై సంపూ ఎలిమినేట్ చేయాలని కోరాడు.

మరోవైపు నీ ఇష్టప్రకారమే ఈ షోలోకి వచ్చావని బిగ్ బాస్ సర్థి చెప్పినా, సంపూర్ణేష్ బాబు పట్టించుకోలేదు. పైగా కత్తులతో కోసేసుకుని చస్తానంటూ బెదిరించాడన్న ఓ సమాచారం అందుతోంది. దీంతో నిర్వాహకులు భయపడి ఎట్టకేలకు సంపూ ఎలిమినేట్ కు సిద్ధమయ్యారని తెలుస్తోంది.. అయితే అతను బయటకు వచ్చాడా? లేదా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ షోలో సీక్రెట్ రూంలో కొంత మందిని ఉంచి తరువాత మళ్లీ షోకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను కలిసి, మళ్లీ షోలోకి వస్తాడా? అన్న డౌట్లే మిగిలిపోయాయి. ఒకవేళ కంప్లీట్ గా బయటకు వచ్చేస్తే మాత్రం నిబంధనల ప్రకారం పెనాల్టీ భారీగానే చెల్లించాల్సి ఉంటుంది.

ఇక హిందీలో పెద్ద పెద్ద కాంట్రవర్సీలే జరుగుతుంటాయి. కానీ, మన వర్షన్ షోలో మాత్రం ఇప్పటిదాకా చిన్నచిన్న ఘటనలే చోటు చేసుకున్నాయి. సిగిరెట్ల వంకతో బిగ్ బాస్ పై శివబాలాజీ చిందులేయడం, కెప్టెన్ కల్పన మాటలతో తన బాల్యంలో హాస్టల్ గుర్తుకొచ్చిందంటూ ముమైత్ ఖాన్ ఏడుపు, అనారోగ్యం బాధిస్తోందంటూ.. అవమానిస్తున్నారంటూ సంపూర్ణేష్ ఆందోళన మినహా ఏదీ పెద్ద వివాదం కాలేకపోయాయి. ఇక సంపూ మంచి అవకాశాన్ని మిస్ చేసకుంటున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bigg Boss Show  Sampoornesh Babu  Elimination  

Other Articles