ఎన్టీఆర్, రణ్ బీర్ లు ‘టాక్స్’ ఛీటింగ్ చేశారంట | Examine service tax liability in Nannaku Prematho

Cag show cause notice to ntr

CAG NTR, NTR Tax Anomalies, NTR Tax evasion, Nannaku Prematho Tax Evasion NTR, NTR Tax Evasion CAG, NTR Tax Notices, Nannaku Prematho Tax Notices, Nannaku Prematho Cheat Tax Department, NTR Ranbir Tax Evasion

CAG scanner on actors for service tax anomalies. Served Show Cause notices to NTR. And also Ranbir Kapoor, Ajay Devagan, Riteish Deshmukh, Arjun Rampal and Salman Khan,

టాక్స్ ఎగ్గొట్టాడంటూ ఎన్టీఆర్ కు నోటీసులు

Posted: 08/05/2017 09:03 AM IST
Cag show cause notice to ntr

టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కు ఊహించని ఝలక్ తగిలింది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపుల్లో జరిగిన అవకతవకలపై కాగ్‌ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) అధ్యయనం చేయగా, అందులో ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన లెక్కలు బయటపడ్డాయి. దీంతో షోకాజ్ నోటీసు జారీ చేసింది.

సుకుమర్ దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో ఫారిన్ లో షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. కాబట్టి అది సేవల ఎగుమతి కిందకు వస్తుందని చెబుతూ ఎన్టీఆర్ టాక్స్ ఎగ్గొట్టాడంట. లండన్‌ కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 7.33 కోట్ల రూపాయలను 2015లో పారితోషికంగా తీసుకున్నాడు.ఇందులో పన్నుగా చెల్లించాల్సిన 1.10 కోట్ల రూపాయలను ఎక్స్‌ పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసుగా పరిగణించి పన్ను మినహాయింపునిచ్చారని కాగ్ తెలిపింది. ఈ వ్యవహారంతోపాటు మరికొన్ని బాలీవుడ్ చిత్రాలకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేసింది.

ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. రణ్ బీర్ కపూర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ నటించిన ‘‘ఏ దిల్‌ హై ముష్కిల్‌’’ సినిమా కూడా న్యూయార్క్ లో చిత్రీకరించామని చెబుతూ, రణ్ బీర్ 6.75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుని, 83.43 లక్షల రూపాయల పన్ను మినహాయింపు పొందాడని కాగ్ తెలిపింది. రణ్ బీర్ తో పాటు అజయ్ దేవగన్, రితేష్ దేశ్ ముఖ్, అర్జున్ రాంపాల్ మరియు స్టార్ హీరో సల్మాన్ లకు సంబంధించిన లావాదేవీలు కూడా పరిశీలనలోకి వచ్చాయని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

ఎన్టీఆర్ రియాక్షన్...

పొరుగుదేశంలో నిర్మించిన చిత్రానికి భారత్ లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతోనే తాను నిర్మాతల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదని అన్నాడు. దీనిపై 2016లో జరిగిన కాగ్ ఎంక్వయిరీలో ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తన ఆడిటర్లు తెలియజేయడం కూడా జరిగిందని తెలిపాడు. ఆ తరువాత దానికి సంబంధించిన నోటీసులు కానీ, ఇతర వివరాలేవీ తనకు అందలేదని ఆయన స్పష్టం చేశాడు.

చాలా సంవత్సరాలుగా పన్నులు, సర్వీస్ ట్యాక్సులు క్రమబద్ధంగా చెల్లిస్తున్న వ్యక్తిని తానని ఆయన చెప్పాడు. భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఏనాడూ మరువలేదని ఆయన తెలిపాడు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో నోటీసులు ఏవైనా అందితే అందులోని వివరాల ప్రకారం అణాపైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించాడు. ఈ విషయంలో వివరాలు తెలియాల్సి ఉందని, చట్టానికి కట్టుబడి ఉండాలని నమ్మే వ్యక్తిని తానని, ఈ విషయంలో కూడా అలాగే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  Nannku Prematho  Tax Evasion  

Other Articles