Sanjay Dutt talks about his days in prison

Sanjay dutt in bhoomi movie promotions

Sanjay Dutt, Jail Life, Bhoomi Movie Promotions, Cigar Story, Jail In mate Rapist

Sanjay Dutt reveals that he was beaten by his father Sunil Dutt for smoking. And Also Said he never talk with hi Co inmate in Jail Because of Rapist.

స్మోకింగ్ మానలేకపోతున్నా.. రేపిస్ట్ తో అస్సలు మాట్లాడలేదు: సంజయ్ దత్

Posted: 09/07/2017 06:43 PM IST
Sanjay dutt in bhoomi movie promotions

సినిమాలో ఏదో ఫార్మాలిటీగా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హెచ్చరికలు జారీ చేసే బాలీవుడ్ స్టార్లు.. రియల్ లైఫ్ లో మాత్రం ఆ అలవాట్లను అస్సలు మానుకోలేకపోతున్నారు. బాలీవుడ్ లో అయితే ఓపెన్ గానే దొరికిన వాళ్లు ఎందరో.. షారూఖ్ దగ్గరి నుంచి నేటి కుర్ర హీరోల దాకా పబ్లిక్ పొగరాయుళ్ల జాబితాలోనే ఉన్నారు. అయితే సీనియర్ నటుడు సంజయ్ దత్ మాత్రం ఆ అలవాటును ఏదో ఒక రోజు మానేసి తీరతానంటున్నాడు.

చిన్నప్పుడు జరిగిన ఓ ఘటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకుంటున్నాడు కూడా. సిగరెట్ తాగుతూ తన తండ్రి సునీల్ దత్ కి దొరికిపోయిన ఓ సంఘటనను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గుర్తుచేసుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్ చేతిలో సిగరెట్ కనబడటంతో మీడియా ప్రశ్నించగా ఆ సంఘటన గురించి చెబుతూ, ‘ఓ సారి బాత్రూమ్ లో సిగరెట్ తాగుతూ నాన్నకు దొరికిపోయా. అంతే, వెంటనే నన్ను బయటకి ఈడ్చుకెళ్లి చావగొట్టారు’ అని చెప్పాడు.

అయినా సిగరెట్ మానటం తన వల్ల కావడం లేదని, ఏదో రోజు ఈ అలవాటు నుంచి బయటపడతాననే నమ్మకం ఉందని సంజయ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుతం ‘భూమి’ సినిమాలో సంజయ్ దత్ నటించాడు. సినిమా రిలీజ్ కు రెడీ అయింది. జైల్లో ఉన్న సమయంలో ఓ రేపిస్ట్ తన రూంలో ఉండేవాడని, ఇంట్లో మహిళల విలువ నాకు తెలుసు కాబట్టి అతగాడితో ఏనాడూ మాట్లాడేవాడిని కాదని మున్నాభాయ్ చెప్పుకొచ్చాడు. మహిళలను దేవతలతో సమానంగా చూస్తారు. అలాంటి, ఓ మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా(భూమి)లో నటించే అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను? అంటున్నాడు ఈ సీనియర్ నటుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles