అలీ మైకేల్ జాక్సన్ స్టెప్పులు చూశారా? | Ali Baba Chief As Michel Jackson

Alibaba chief as mivhel jackson

Alibaba CEO, Jack Ma, Michel Jackson Alibaba, Jack Ma Surprise Dance, Jack Ma Dance, Jack Ma Stunts, Jack Ma Alibaba Anniversary, Alibaba CEO Jack Ma

Asia's richest man greets 40,000 employees dressed as Michael Jackson. Jack Ma, Alibaba CEO and Asia's richest man, turned up at his company's 18th anniversary birthday bash dressed as Michael Jackson and Make Bike Stunts.

అలీబాబా మైకేల్ జాక్సన్ స్టెప్పులు

Posted: 09/12/2017 06:14 PM IST
Alibaba chief as mivhel jackson

దివంగత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ లోకాన్ని విడిచివెళ్లిపోయినా ఆయన పాటలు మాత్రం ఇంకా మారుమోగిపోతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆయన స్టైలిష్ స్టెప్పులు లేని మెయిన్ ఈవెంట్ల ఉండవంటే అతిశయోక్తి కాదు. అలాంటిది ఇక్కడ ఓ బిజినెస్ మెన్ వేసిన స్టెప్పులు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

అలీబాబా.. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద సంస్థ. ఏషియా ఈ-కామర్స్ దిగ్గజం అయిన అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు జాక్ మా, త‌న కంపెనీ 18వ వార్షికోత్స‌వంలో ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. మైకేల్ జాక్స‌న్ వ‌స్త్ర‌ధార‌ణ‌లోనే `డేంజ‌ర‌స్‌` పాట‌కు జాక్ మా స్టెప్పులేసి త‌న ఉద్యోగుల‌ను అల‌రించారు. అంతేకాకుండా 53 ఏళ్ల జాక్ చివ‌ర్లో బ్లాక్ హెల్మెట్ ధరించి స్టేజీ మీద బైక్‌తో విన్యాసాలు కూడా చేశారు.

 

గ‌తంలో అలీబాబా కంపెనీ 10వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కూడా జాక్ మా త‌న గొంతు స‌వ‌రించుకుని, పాట పాడారు. నాట‌కాలు, క‌ళ‌ల మీద ఆస‌క్తి ఉన్న జాక్ మా, అలీబాబా కంపెనీ స్థాపించ‌డానికి ముందు కూడా కొన్ని ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 54 వేల మంది ఉన్న అలీబాబా గతేడాది బ్లాక్ ఫ్రైడే సందర్భంగా కేవలం 15 గంటల్లో 14.3 బిలియన్ సంపాదించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles