Prakash Raj ex wife's Niece Missing Mystery Solved | డిస్కో శాంతి చెల్లి మేనకొడలు మిస్సింగ్ మిస్టరీ వీడింది. ఎవరు కనిపెట్టారో తెలుసా?

Disco shanti s niece missing mystery solved

Disco Shanthi, Disco Shanthi Niece, Disco Shanthi Sister, Prakash Raj Lalitha Kumari, Prakash Raj Ex Wife, Disco Shanthi Sister Lalitha Kumari, Lalitha Kumari Niece Abrina

Disco Shanthi and Prakash Raj Ex-Wife Lalitha Kumari's niece Abrina goes missing. Plus two student, goes missing since last 6 Days.

డిస్కో శాంతి మేనకోడలు ఆచూకీ దొరికింది

Posted: 09/16/2017 05:16 PM IST
Disco shanti s niece missing mystery solved

టాలీవుడ్ నటి, దివంగత నటుడు శ్రీహరి సతీమణి శాంతి మేనకోడలు అబ్రిన్‌ అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె సోదరుడు, సహాయ దర్శకుడు అరుణ్‌ మొళి వర్మన్‌ కుమార్తె అబ్రిన్‌ (17) గత ఐదు రోజులుగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శాంతి, ఆమె సోదరి లలిత కుమారి మీడియాను ఆశ్రయించారు.

సెప్టెంబర్ 6న పాఠశాలకు వెళ్లిన అబ్రిన్ మళ్లీ తిరిగి రాలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు చెన్నైలోని టీనగర్ పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ చిన్నారి ఆచూకీ కనుక్కునేందుకు సీనీ రంగంలోని వారు కూడా సహకరించాలని డిస్కో శాంతి, ఆమె సోదరి లలిత కుమారి విన్నవించారు. అయితే, ఆమె ఆచూకీ తాజాగా తెలిసింది.

వారికి సాయం చేసేందుకు నడిగర్ సంఘం ముందుకు వచ్చింది. సినీ ప్రముఖులు అబ్రిన్ మిస్ అయిన విషయాన్ని, ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఆమె దొరికిందన్న విషయాన్ని కోలీవుడ్ నటుడు కార్తీ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. గత రాత్రి ఆమె ఆచూకీ కనుగొన్నామని చెప్పాడు. ఆమెను గాలించడానికి సహకరించిన బెంగళూరులోని వాలంటీర్లకు, తమిళనాడు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, లలిత కుమారి ప్రకాశ్ రాజ్ మాజీ భార్య కావటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles