టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పై కాపీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఎప్పుడో ఆరేళ్ల కిందట విడుదలైన సినిమా మిస్టర్ ఫర్ ఫెక్ట్ గురించి ఇప్పుడు ఆరోపణలు వినిపించటం విశేషం. ప్రభాస్ కాజల్ జంటగా నటించిన ఈ చిత్రం దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే రూపొందిన విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రం తాను రాసిన ‘నా మనసు కోరింది నిన్నే’ అనే నవలను కాపీ కొట్టి తీశారంటూ శ్యామలా రాణి అనే రచయిత్రి ఇటీవలే చిత్ర యూనిట్ మీద కేసు వేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు విషయమై దిల్ రాజు ఏమీ స్పందించలేదు. ఐతే దర్శకుడు దశరథ్ మాత్రం ఆ రచయిత్రికి సమాధానమిచ్చారు. శ్యామలా రాణి నవల 2010 ఆగస్టులో తొలిసారి ప్రచురితమైందని ఆమె చెబుతున్నారు.
కానీ, అంతకు 18 నెలల కిందటే తాను రైటర్స్ అసోసియేషన్లో ‘నవ్వుతూ..’ పేరుతో ఓ కథను రిజిస్టర్ చేయించానని దశరథ్ చెప్పాడు. బిల్లా షూటింగు సమయంలోనే తాను, దిల్ రాజు ఆ కథను ప్రభాస్ కు వినపించామని దశరథ్ అంటున్నారు. ఆరు నెలల కిందటే రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ.. శ్యామలా రాణికి ఈ అంశం వివరించే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదని దశరథ్ చెప్పాడు. ఇప్పటికైనా ఆమె వివాదానికి ముగింపు పలికితే మంచిదని దశరథ్ సూచించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more