Mani Ratnam Plans Movie With Vijay Devarakonda | మల్టీస్టారర్ కాదు.. సోలో లవ్ స్టోరీనా?

Vijay devarakonda with classic director

Mani Ratnam, Arjun Reddy Movie, Vijay Devarakonda, Mani Ratnam Vijay Devarakonda, Vijay Devarakonda Big Director

Kollywood Senior Director Mani Ratnam plan a movie with Arjun Reddy Hero Vijaydevara Konda. A Romantic Story after Multi Starrer Movie.

విజయ్-మణిరత్నం కాంబోలో మూవీ?

Posted: 09/21/2017 05:17 PM IST
Vijay devarakonda with classic director

చేసింది ఐదు చిత్రాలు. అందులో రెండు గెస్ట్ రోల్స్.. ఒకటి డిజాస్టర్. కానీ, మిగిలిన రెండు చిత్రాలు మాత్రం అతనికి యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించి పెట్టాయి. అతనే విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో అతనిపై అంచనాలను అమాంతం పెంచేసుకున్న ఈ యంగ్ హీరో బోల్డ్ స్టేట్ మెంట్లతో మరింత పాపులర్ అయిపోయాడు. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లలో నటిస్తున్న విజయ్ దేవరకొండను ఓ అరుదైన అవకాశం దక్కిందనే వార్త వినిపిస్తోంది.

ప్రస్తుతం మణిరత్నం ఒక మల్టీ స్టారర్ ను తెరకెక్కించే పనిలో వున్నారు. ఈ సినిమాలో శింబు .. విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ .. జ్యోతిక .. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. తెలుగు స్టార్ నాని అవకాశం కోల్పోవటంతో ఆ ప్లేస్ లో విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఈ సినిమా తరువాత మణిరత్నం మళ్లీ ఒక లవ్ స్టోరీని ప్లాన్ చేశారట. ఆ కథకి తగిన హీరో కోసం చూస్తున్న ఆయనకి విజయ్ దేవరకొండ దృష్టిలోకి వచ్చాడని సమాచారం.

'అర్జున్ రెడ్డి' చూసిన మణిరత్నానికి విజయ్ దేవరకొండ నటన కూడా బాగా నచ్చిందట. దాంతో ఆయనని హీరోగా ఎంపిక చేసుకున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చెబుతున్నారు. మణిరత్నం సినిమాలో ఛాన్స్ కోసం కొంతమంది యంగ్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, విజయ్ కి ఇంత త్వరగా ఆ ఛాన్స్ దక్కితే మాత్రం విశేషమనే అనుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles