Bollywood Political satire 'Newton' for the Oscars 2018 | ఇవాళే రిలీజ్ అయ్యింది.. ఆపై ఆస్కార్ కు నామినేట్.

Bollywood movie india s entry for the oscars

Newton Movie, Rajkummar Rao, Rajkummar Rao Newton, Rajkummar Rao Oscars 2018, Oscars 2018 Indian Foreign Movie, Oscars 2018 Foreign Category Indian Movie

‘Newton’ is India’s official entry to Oscars 2018. The Rajkummar Rao-starrer is about free and fair elections in conflict-ridden jungles of Chhattisgarh.‘Newton’ will be India’s official entry to the Best Foreign Film catgory at the Oscars next year, says a Film Federation of India official.

ఆస్కార్ 2018 ఎంట్రీకి బాలీవుడ్ న్యూటన్

Posted: 09/22/2017 03:52 PM IST
Bollywood movie india s entry for the oscars

బాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడిగా పేరు సంపాదించుకున్న రాజ్ కుమార్ రావు తాజా చిత్రం న్యూటన్ పంట పడింది. చిత్రం ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ అవార్డు ఎంట్రీకి ఎంపికైంది. ఉత్త‌మ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమా నామినేట్ అయింద‌ని అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

మరోవైపు చిత్ర హీరో రాజ్‌కుమార్ రావు ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ సినిమా బృందానికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నాడు. రాజ‌కీయ వ్యంగ్య‌రూప‌కంగా తీసిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావుతో పాటు పంక‌జ్ త్రిపాఠి, అంజ‌లి పాటిల్‌, ర‌ఘుబిర్ యాద‌వ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది.

అడవుల్లో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు అమిత్ మసూకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇవాళే రిలీజ్ కావటం.. అస్కార్ కు నామినేట్ కావటం డబుల్ సంతోషాన్ని ఇచ్చిందని అమిత్ తెలిపారు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ చిత్రం ఈ హైప్ తో ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles