మహేశ్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’ ఓపెనింగ్ డే కలెక్షన్లు 38 కోట్ల పై మాటే అని తేలింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ కలెక్షన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఊరట ఇచ్చే అంశం ఏంటంటే.. తన కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టడం విశేషం.
తొలి రోజు వసూలు డిస్ట్రిబ్యూటర్ షేర్ 16.11 కోట్లు రాబట్టగా, గతంలో ఈ రికార్డు శ్రీమంతుడు (14.44 కోట్టు) ఉంది. ఈ యేడాదిలో వచ్చిన డీజే కన్నా తక్కువే మహేష్ సాధించటం చర్చనీయాంశంగా మారింది.
నైజాం 4.15Cr
సీడెడ్ 1.98Cr
ఉత్తరాంధ్ర 1.75Cr
గుంటూరు 2.10Cr
ఈస్ట్ 2.31Cr
వెస్ట్ 1.90Cr
కృష్ణా 0.89Cr
నెల్లూరు 1.03Cr
మొత్తం 16.11Cr
తమిళ్ లో సూపర్ రెస్పాన్స్...
సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి ప్రశంసలు వచ్చాయి. విభిన్న కథతో తమిళ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాను రజనీకాంత్ ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా బాగుందని అన్నారు. ఈ సినిమాలో యాక్షన్‌తోపాటు మంచి సందేశం కూడా ఉందని అన్నారు.
దర్శకుడు మురుగదాస్ ఈ సబ్జెక్ట్‌ను అద్భుతంగా హ్యాండిల్ చేశారని, మహేశ్ బాబు నటన అద్భుతమని రజనీ కాంత్ చెప్పారు. ఇటువంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించిన ఆ సినిమా యూనిట్ కి తన అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నిన్న విడుదలైన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. మురుగదాస్ తనదైన శైలిలో ఓ మంచి సందేశాన్ని ఇస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more