Brahmi to be felicitated in Seattle | ఎస్వీఆర్ తర్వాత మళ్లీ బ్రహ్మీనే...

Brahmanandam to be felicitated in seattle

Brahmanandam, South Asian Film Festival 2017, Brahmi International Felicitation, Brahmi SVR, International Film Festival Brahmaandam

Brahmanandam is busy with his film 'Achari America Yatra' in the USA. His career is not doing all that well and the comedian is earnestly doing his best to revive it. Meanwhile in Seattle, the actor will be felicitated on October 7th at the South Asian Film Festival. Brahmi, once was a must for films and was in par with the leading actors of the movie. After SV Ranga Rao, he is going to be the second Telugu actor to be felicitated on the stage of an International Film Festival.

బ్రహ్మీకి అరుదైన పురస్కారం

Posted: 10/03/2017 07:05 PM IST
Brahmanandam to be felicitated in seattle

సీనియర్ నటుడు, టాప్ కమెడియన్ బ్రహ్మనందం గురించి గత కొంత కొన్ని రోజులుగా అనారోగ్య పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారంటూ కుటుంబ సభ్యులు కొట్టిపడేయగా, విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర' షూటింగ్ హుషారుగా పాల్గొంటున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ తరపున ఆయనకు సన్మానం చేయనున్నారు. అమెరికాలోని సియాటెల్ నగరంలో ఈ నెల 6న‌ జరగ‌నున్న‌ తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా హాజరుకావాలని ప్రముఖ హాస్య‌నటుడు బ్రహ్మానందంకి నిర్వాహ‌కులు ఆహ్వానం పంపారు. ఇదే వేదికపై ఈ నెల‌ 7న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంని ఘనంగా సన్మానించనుంది.

ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన నటుడు ఎస్వీ రంగారావు మాత్ర‌మే. ఆ తర్వాత బ్రహ్మానందం నిల‌వ‌నున్నారు. 1964 జకార్తా చిత్రోత్సవాల్లో నర్తనశాల చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎస్వీఆర్ అవార్డు పొందారు. ఆ తర్వాత తిరిగి ఇన్నేళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్క‌డం ఇదే మొద‌టిసారి. పీపుల్ మీడియా సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ మీడియాకు ఈ వార్త తెలియజేస్తూ హర్షం వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles