శర్వానంద్ మహానుభావుడు డీసెంట్ టాక్ సంపాదించుకున్న కలెక్షన్లు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే పరిస్థితి మెల్లిగా మారుతుండటంతో మున్ముందు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నైజాంలో రెండు పెద్ద చిత్రాలకు ఎక్కువ సంఖ్యలో థియేరట్లు దక్కటం కూడా ఓ ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుండటంతో థియేటర్ల సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నారు.
ఈ సినిమాకి పోటీగా ఈ వీకెండ్ లో మరో సినిమా ఏదీ లేకపోవడంతో, అదనంగా మరో 100 థియేటర్లను పెంచారట. ఒక్క హైదరాబాద్ లోనే 70 థియేటర్లను పెంచినట్టుగా చెబుతున్నారు. దీని వలన వీకెండ్ వసూళ్లు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. పైగా ఈ స్థాయిలో థియేటర్లను పెంచడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.
అతిశుభ్రత(ఓసీడీ)వ్యాధితో బాధపడే ఓ యువకుడు.. దాని మూలంగానే తన ప్రేమ సమస్యల్లో పడటం.. దానిని ఎలా అధిగమించాడు అన్న కాన్సెప్ట్ ను మారుతి చాలా ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించాడు. కథనాలు ఆ రెండింటితో కలిపి అందించిన కామెడీ ఈ సినిమాకి బలంగా నిలిచాయి కూడా.
మమానుభావుడు ఐదు రోజుల కలెక్షన్లు
నైజాం : Rs 3.7 కోట్లు
సీడెడ్ : Rs 1.72 కోట్లు
ఉత్తరాంధ్ర : Rs 1.88 కోట్లు
తూర్పు గోదావరి : Rs 1.18 కోట్లు
పశ్చిమ గోదావరి : Rs 0.7 కోట్లు
కృష్ణా : Rs 1.04 కోట్లు
గుంటూరు : Rs 1.32 కోట్లు
నెల్లూరు : Rs 0.38 కోట్లు
మొత్తం 5 రోజుల కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో : Rs 11.92 కోట్లు (షేర్)
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా : Rs 14.93 కోట్లు
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more