Nag Movie not exact remake of Malayalam movie | నాగ్ మూవీ ఖచ్ఛితంగా రీమేక్ చేయలేదంట!

Ohmkar on rgg2 remake mark

Raju Gari Gadhi 2, Malayalam Movie, Pretham Telugu Remake, Pretham Raju Gari Gadhi 2, Raju Gari Gadhi 2 Director Ohmkar

Director Ohmkar admits that producer PVP has bought rights of Malayalam hit ‘Pretham’ to make it into ‘Raju Gari Gadhi 2’. However, he continues, it is not exact remake. “I had taken just 30 percent from the original movie. Rest of the drama and scenes are entirely created by my team. It is more of an inspiration than a remake,” he adds further.

రాజు గారి గది 2... రీమేక్ కాదు : ఓంకార్

Posted: 10/10/2017 05:00 PM IST
Ohmkar on rgg2 remake mark

హర్రర్ థ్రిల్లర్ రాజుగారి గది 2 మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడానికి దారితీసిన పరిస్థితులను గురించి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓంకార్ వివరించాడు. అంతేకాదు మళయాళ చిత్రం ప్రేతమ్ కు రీమేక్ అన్న వార్తలను ఆయన ఖండించారు.

ఈ నేపథ్యంలో తాను పీవీపీ గారిని సరదాగా కలిసినప్పుడు ఆయన 'రాజుగారి గది 2' చేద్దామన్నారనీ అప్పుడే కథ పుట్టిందని ఓంకార్ అన్నాడు. రాజుగారి గది 2 పేరుతో తాను సిద్ధం చేసుకున్న కథను ముందుగా వెంకటేశ్ కి వినిపించడం జరిగిందనీ, ఆయనకి ఆ కథ బాగా నచ్చేసిందని అన్నారు.తాను కమిటైన రెండు సినిమాల తరువాత ఆయన ఈ సినిమా చేస్తానన్నారని చెప్పారు.
అయితే తనకి వినిపించిన కథను మాత్రం తానే చేస్తానంటూ వెంకటేశ్ ఆ కథను లాక్ చేసుకున్నారని చెప్పారు.

అప్పుడు అదే టైటిల్ తో .. మలయాళ మూవీ 'ప్రేతమ్' నుంచి తీసుకున్న ఓ పాయింట్ తో కొత్త కథను తయారుచేసుకోవడం జరిగిందని చెప్పారు. సినిమా యాజ్ ఇట్ ఈజ్ గా తీయలేదని చాలా వరకు మార్పులు చేశానని ఓంకార్ చెప్పారు. వెంకటేశ్ గారి కోసం అనుకున్న కథ అలాగే ఉందని, ఆయనతోనే ఆ చిత్రం తీస్తానని ఓంకార్ చెప్పాడు. ఇకపై కూడా ఇంగ్లిష్ మూవీస్ తరహాలో 'రాజుగారి గది'కి సీక్వెల్స్ వస్తూనే వుంటాయని చెప్పుకొచ్చారు.

ఓ రిసార్ట్ లో ఇద్దరు యువతుల మధ్య ఇగో సమస్య తలెత్తటం.. అందులో ఓ యువతి మరో యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి నెట్ లో పెట్టడం. అవమానభారంతో యువతి చనిపోవటం. దెయ్యమై ఆ రిసార్ట్ వచ్చేవారిని వేధించటం.. అప్పుడే మెంటలిస్ట్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించటం ఇదే కథ అని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles