Rajinikanth's 2.0 Last Schedule In Progress | 2.0 చివరి అంకానికి చేరింది. ఫస్ట్ టైమ్ కొత్త టెక్నాలజీ

Rajini movie shooting almost complete

2.0 Movie, 2.0 Rajinikanth, Rajinikanth-Akshay Kumar, Shankar 2.0, 2.0 Last Schedule, 2.0 Movie Shooting

Rajinikanth-Akshay Kumar's 2.0 Last Schedule In Progress. Rehearsals over, last song of '2 Point o' from today. Shankar's 2.0 to have audio launch in Dubai.

2.0 షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది

Posted: 10/11/2017 11:21 AM IST
Rajini movie shooting almost complete

శంకర్ - రజనీకాంత్ ఇండియాలోనే ఇప్పటిదాకా లేని రీతిలో అంచనాలను రేకెత్తిస్తూ రోబో 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తోపాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా '2.0' అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. తొలిసారి త్రీడీ ఎఫెక్ట్స్ తోపాటు స్టోరీ పరంగానూ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడని టీజర్లు చెబుతున్నాయి.

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది. ఒక పాట మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. రజనీ .. ఎమీ జాక్సన్ కాంబినేషన్లోని ఈ సాంగ్ ను ముంబైలో వేసిన ఓ భారీ సెట్లో, ఈ రోజు నుంచి చిత్రీకరించనున్నారు. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరిస్తారని సమాచారం. సినిమాలోని హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట నిలుస్తుందని అంటున్నారు. రెహ్మాన్ సంగీతాన్ని అందించిన ఈ పాటను, శంకర్ తనదైన శైలిలో చిత్రీకరించనున్నాడు.

 

ఈ ట్యూన్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సాంగ్ కి .. మైఖేల్ జాక్సన్ కి మధ్య ఏదో కనెక్షన్ వుంటుందట. అదేంటన్నది తెరపైనే చూడాలంటూ సస్పెన్స్ లో పెట్టేస్తున్నారు. జనవరి 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ఎమీ జాక్సన్ కెరియర్ స్పీడ్ ను ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి మరి. దుబాయ్ లో ఆడియోను భారీ లెవల్లో రిలీజ్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. నవంబర్ 22న హైదరాబాద్ లో టీజర్ లాంఛ్ చేయబోతున్నారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles