Robo 2.0 story Two Robots Love | శంకర్ కొత్త పోస్టర్ పెడితే.. 2.0 కథేంటో చెప్పేస్తున్నారు

Robo 2 0 story reveal

2.0 Movie, Rajinikanth 2.0 Movie, 2.0 Movie Story, 2.0 Movie Social Media, 2.0 Movie Story Leaked, 2.0 Movie Robotic Love, 2.0 Movie Story Viral, Shankar 2.0 Movie Story

2.0 Movie Story Viral on Social Media. Amid 2.0 Movie Audio Launch Shankar Posted a New Photo in his Twitter. According to that People Viral stories in Social Media. Amy and Rajinikanth Robotic Love and Akshay as Bad Scientist Character.

రోబో 2.0 స్టోరీ అదేనా?

Posted: 10/25/2017 02:29 PM IST
Robo 2 0 story reveal

ఇండియన్ స్పీల్ బర్గ్, సౌత్ టాప్ దర్శకుడు శంకర్ 2.0 విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. మేకింగ్ వీడియోలు, పోస్టర్లతో హడావుడి చేస్తున్నప్పటికీ.. స్టోరీ బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఓ క్రూర సైంటిస్ట్ కు.. మంచి సైంటిస్ట్ వశీకర్... రెండు రోబోల మధ్య జరిగే కథతోనే సినిమా ఉండబోతుందని ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు.అయితే విడుదల చేసిన ఓ పోస్టర్ తో దాదాపు కథను రివీల్ చేశాడనే చర్చించుకుంటున్నారు.

ఇటీవ‌ల అమీ జాక్స‌న్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసిన శంకర్.. ఇవాళ మరో పోస్టర్ ను వదిలాడు. చిట్టి రోబో-అమీ మధ్య ప్రేమ తాలుకు పోస్టర్ అది. ఇప్పటికే అమీ రోబో క్యారెక్టర్ అని లీకైన ఫోటోలు.. అఫీషియల్ పోస్టర్ ద్వారా తేలింది. దాని ప్రకారం.. రోబో అయిన చిట్టి(రజనీకాంత్) మనసులో ఫీలింగ్స్ కోసం లేడీ రోబో(అమీ)ని సృష్టించటం.. మరోవైపు డాక్టర రిచర్డ్(అక్షయ్ కుమార్) పాత్ర చేసే విధ్వంసం... అతన్ని అడ్డుకునేందుకు ఈ రెండు రోబోల పోరాటం... చివరకు రిచర్డ్ ను ఓడించే క్రమంలో లేడీ రోబో ప్రాణ త్యాగం.. ఇలా కథ ఉండే అవకాశం ఉందనే టాక్. ఆ లెక్కన్న సైంటిస్ట్ వశీకర్ పాత్రకు చిత్రంలో హీరోయినే లేదని కొందరు అంటున్నారు. ఇప్పుడు ఈ కథలను కొందరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

అసలే భారీ అంచనాలు ఉన్న సినిమా కావటంతో కోలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ప్రస్తుతానికైతే ఎల్లుండి అంటే ఈ శుక్ర‌వారం దుబాయ్‌లో ఆడియో విడుద‌ల వేడుక మీదే అందరి దృష్టి ఉంది. మరి ఈ స్టోరీ లైన్ కు.. ఆ రెండు రోబోలకు... అక్ష‌య్ కుమార్ రిచ‌ర్డ్ పాత్ర నిజానిజాలు తెలియాలంటే రిపబ్లిక్ డే దాకా ఒపిక పట్టాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles