BJP Asks Padmavati Movie Release Moved Ahead | పొలిటికల్ టర్న్.. పద్మావతి వాయిదా వేయాలని బీజేపీ డిమాండ్

Padmavati release may postpone

BJP, Padmavati Movie, Gujarat Elections, Padmavati Postpone, Padmavati Controversy, Deepika Padukone, Ranveer Singh, Sanjay Leela Bhansali, Mersal Controversy, BJP Padmavati

BJP to ask poll panel, Censor to stay release of Padmavati. Maharashtra tourism minister demands ban on Sanjay Leela Bhansali's 'Padmavati. Padmavati 3D Trailer Launch: Mob of Rajput Mahamorcha distributes pamphlets, threaten to burn down theatres?. 'Padmavati' Release Moved Ahead! BJP Seeks Delay Fearing Tension Ahead Of Gujarat Polls.

బీజేపీ లేఖ.. పద్మావతి రిలీజ్ వాయిదా?

Posted: 11/02/2017 04:20 PM IST
Padmavati release may postpone

బాలీవుడ్ చిత్రం పద్మావతి రిలీజ్ కు ఆటంకాలు తప్పేలా కనిపిస్తున్నాయి. సంజయ్‌ లీలా భన్సలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రాజకీయంగా దుమారం రేపేలా ఉంది. ఈ విడుద‌లను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని కోరుతూ బీజేపీ నేత ఐకే జడేజా, మహారాష్ట్ర టూరిజం మినిస్టర్ జయకుమార్ లు  కేంద్ర ప్రభుత్వానికి రాయాలని నిర్ణయించుకున్నారు.

సినిమాలో కొన్ని స‌న్నివేశాలు క్ష‌త్రియ వ‌ర్గ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. మ‌హారాణి ప‌ద్మావ‌తి, కోపిష్టి అయిన అల్లాఉద్దీన్ ఖిల్జీల మ‌ధ్య సంబంధాన్ని త‌ప్పుగా చూపించే ప్ర‌య‌త్నం చేసి, చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని ఐకే జ‌డేజా అన్నారు. గతంలో రాజ్ పుత్ సంఘాలు కూడా ఇలాంటి ఆరోపణలే చేస్తూ దర్శకుడు భన్సాలీపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం వివాదం చాలా తీవ్రంగా ఉంది. గుజరాత్ ఎన్నికలు ఉన్నాయి. అందుకే వివాదం సద్దుమ‌ణిగే వ‌ర‌కు సినిమా విడుద‌లను తాత్కాలికంగా నిలిపివేయాల‌ని కోరుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

అయితే ఇలా లేఖ రాయ‌డానికి సామాజిక ఉద్దేశ‌మే త‌ప్ప రాజ‌కీయ ఉద్దేశం లేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. సీబీఎఫ్‌సీ, ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌కి లేఖ ప్ర‌తిని పంపించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇంకోవైపు ముందు తమకు స్క్రీనింగ్ చేయకపోతే  థియేటర్లు తగలబెడతామని రాజ్ పుత్ సంఘాలు హెచ్చరించాయి.   మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఇక ఈ చిత్ర శాటిలైట్ హక్కులు 25 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles