Racial Profile Composer Detained at Sydney Airport | కబాలి, కాలా సంగీత దర్శకుడికి ఘోర అవమానం

Racial treatment for kollywood music director

Santhosh Narayanan, Sydney Airport, Racial Treatment, Kaala Santhosh Narayanan, Santhosh Narayanan Twitter, Santhosh Narayanan Allegations,Santhosh Narayanan Racism

Composer Santhosh Narayanan accuses Sydney Airport officials of racial profiling. But, Airport Authority Denies such allegations says its a part of duty.

కోలీవుడ్ సంగీత దర్శకుడిపై జాతి వివక్షత?

Posted: 11/18/2017 10:13 AM IST
Racial treatment for kollywood music director

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, కబాలి ఫేమ్ సంతోష్ నారాయణన్ జాతి వివక్షతను ఎదుర్కున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు.

సిడ్నీ ఎయిర్ ఎయిర్ పోర్ట్ లో అనుమానిత రసాయనాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో అధికారులు ఆయన్ని పక్కన నిలబెట్టి ఘోరంగా అవమానించారంట. ఎనిమిదిసార్లు తనని తనిఖీలు చేశారని.. ఓ అధికారి తనతో అమర్యాదగా ప్రవర్తించాడని.. ఇలాంటి జాతి వివక్షతను కట్టడి చేయాల్సి ఉంది అంటూ ఆయన సిడ్నీ ఎయిర్ పోర్ట్ అధికార పేజీని ట్యాగ్ చేశారు.

 

దీంతో ఎయిర్ పోర్ట్ శాఖ స్పందించింది. ఇది ప్రభుత్వం రూపొందించిన నియామవళి అని పేర్కొంది. ‘‘పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకే ఈ పరీక్షలు. అధికారులు ఒక్కోక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ముందుకు పంపుతారు. ఈ క్రమంలో ఒకరు ముందు.. మరోకరిని వెనుక పరిశీలించి ఉండొచ్చు. అంతేకాదు ఇందులో ఎలాంటి జాతి వివక్షత లేదు అని వరుస ట్వీట్లలో వివరించింది.

అయితే భద్రత కోసమయితే తాను ఎన్నిసార్లైనా వరుసలో నిలుస్తానని.. కానీ, కొంత మంది అధికారులు ఆ నియమావళిని జాతి వివక్షత ప్రదర్శించేందుకు వాడటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 2012లో పా రంజిత్ డెబ్యూ ఆటకత్తితోనే సంతోష్ కోలీవుడ్ లో అడుగుపెట్టాడు. తర్వాత రజనీకాంత్ కబాలి ద్వారా బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం కాలాకు కూడా ఆయనే సంగీతం అందిస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Santhosh Narayanan  Racial Treatment  

Other Articles