Amithabh Shared Junior Shah Rukh's Happiest Moments | అమితాబ్ ను తాత అనుకుని షారూఖ్ కొడుకు ఏం చేశాడంటే...

Big b shared junior srk pics

Amitabh Bachchan, Sharukh Khan Son Abram, Big B AbRam, AbRam Khan Amithabh Bachchan, Buddhi ka Baal Big B AbRam

Big B Amitabh Bachchan Shares Happiest Moments with Sharukh Khan's Youngest Son. And as for this little bundle .. he wanted the fluffy 'buddhi ka baal' cone .. so we took him to the stall made one for him and the joy of getting it is just priceless .. Big Tweeted. AbRam Khan Thinks that Amitabh Bachchan is Shah Rukh's Father. SRK Replied.

షారూఖ్ కొడుకు ఫోటోలు ట్వీట్ చేసిన బిగ్ బీ

Posted: 11/20/2017 05:13 PM IST
Big b shared junior srk pics

బాలీవుడ్ లో ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్ పెడుతూ సీనియర్ హీరోలంతా కలిసి మెలిసి ఉండటం ఈ మధ్య బాగా కనిపిస్తుంది. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బాద్ షా షారూఖ్ ల మధ్య కూడా కొన్నేళ్ల క్రితం ఇలాంటి గ్యాపే ఒకటి ఏర్పడింది. కానీ, తర్వాత వారిద్దరూ మనస్పర్థలను పక్కన పెట్టేసి ఒకటైపోయారు కూడా.

తాజాగా ఐష్-అభిషేక్ ల కూతురు, అమితాబ్ మనవరాలు ఆరాధ్య పుట్టిన‌ రోజు వేడుకలకు షారూఖ్ ఫ్యామిలీ కూడా హాజరయ్యింది. ఈ సందర్భంగా షారుక్ చిన్న కొడుకు అబ్‌రామ్‌ పీచు మిఠాయి కావాలని మారాం చేశాడంట. దీంతో బిగ్ బీ నే స్వయంగా అబ్ రామ్ ను తీసుకుని ఓ మిఠాయి స్టాల్ వద్దకు తీసుకెళ్లి ఇప్పించాడు. ఆ ఫోటోను ట్వీట్ చేసిన అమితాబ్ జూనియర్ షారూఖ్ తో వెలకట్టలేని సమయం అంటూ ట్వీట్ చేశాడు.

దానికి రీ ట్వీట్ చేసిన షారుక్ థాంక్స్ తెలియజేశాడు. థాంక్యూ స‌ర్‌.. ఇది వాడి జీవితంలో చెప్పుకోద‌గిన క్ష‌ణం. అన్నట్లు.. వాడు మిమ్మ‌ల్ని టీవీలో చూసిన‌ప్పుడ‌ల్లా నా తండ్రి అనుకుంటాడు` అంటూ షారుక్ ట్వీటాడు. ఈ ఇద్దరూ కలిసి మొహబ్బతెయిన్,వీర్ జార,కబీ ఖుషీ కబీ ఘమ్, భూత్ నాథ్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles