బాలీవుడ్ లో గత కొంతకాలంగా జూలీ 2 చిత్రం గురించే ప్రత్యేకంగ చర్చించుకుంటున్నారు. ట్రైలర్ లో చూపించిన కొన్ని సన్నివేశాల ఆధారంగా అది ఓ నటి జీవితానికి సంబంధించిన రియల్ స్టోరీ అంటూ ఊహాగానాలు మొదలుపెట్టారు. దీనికి తోడు ఈ చిత్ర నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ చేసిన వ్యాఖ్యలు దానిని ధృవీకరించటంతో ఇప్పుడు అది మరింత రంజుగా మారింది.
అది నగ్మాకు సంబంధించిన కథేనంటూ ఇప్పుడు గత కొంత కాలంగా చెప్పుకుంటున్నాం. దీనిపై ఓ జాతీయ మీడియా నగ్మాను సంప్రదించగా.. ఆపై సమాధానమిచ్చారు. "ఔనా? దీనికి సంబంధించి నాకు ఇంత వరకు తెలియదు. ఈ వార్తను నేను తొలిసారిగా వింటున్నా. ప్రస్తుతం పద్మావతి చిత్రం వివాదంతో వార్తల్లో నిలవటంతో పబ్లిసిటీ కోసమే మేకర్లు ఇలాంటి ప్రకటన ఇచ్చారేమో అంటూ నిట్టూర్పు విడిచారు. ఏది ఏమైనా తానూ సినిమా చూశాకే స్పందిస్తానని ఆమె చెప్పారు.
90వ దశకంలో ఇండియాలో అన్ని లాంగ్వేజ్ ల్లో ఊపు ఊపిన ఓ నటి స్టోరీనే ఈ చిత్రమని నిహ్లానీ కామెంట్ చేశారు. ఖాన్ త్రయంలలో ఒకరితో తన తొలి సినిమాను ఆమె చేసిందని ఆయన చెప్పగా... నగ్మా తన మొదటి చిత్రం భాఘీ సల్మాన్ ఖాన్ తో చేసింది. ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలను ఊపేసిందని.. అది నగ్మాకు సరిగ్గా సరిపోయింది. దీనికి తోడు తమిళ స్టార్ తో నడిపిన అఫైర్ తో ఆమె కెరీర్ ముగిసిందని చెప్పగా.. నటుడు శరత్ కుమార్ తో అఫైర్.. ఆపై ఆయన భార్య ఛాయతో విభేధాలు.. అది విడాకులకు దారితీయటం... అనూహ్యంగా నగ్మా కెరీర్ కు అక్కడే ఫుల్ స్టాప్ పడింది. దక్షిణాది నుంచి భోజ్ పురికి వెళ్లి మరో స్టార్ హీరోతో అఫైర్ కొనసాగించిందని, అతనూ జూలీ-2లో ఉన్నాడని కూడా నిహ్లానీ చెప్పారు. దాని ప్రకారం నటుడు రవికిషన్ (రేసు గుర్రం ఫేమ్) జూలీ-2 లో నటిస్తుండగా... ఇంతకు మించి అది నగ్మా అని చెప్పటానికి కారణాలేవీ అక్కర్లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా రేపు విడుదలయ్యే ఈ చిత్రం ఓ నటి జీవితంలోని చీకటి కోణాలను ఆవిష్కరించజేయబోతుందన్న మాట. ఒకవేళ అది నగ్మా జీవిత కోణమే అయితే ఆమె ఎలా స్పందిస్తుందో? లేక ఆమెకు తెలిసే ఇదంతా జరుగుతుందా? ఏం జరగబోతుందో... లెట్ సీ!
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more