Allu Sirish Okka Kshanam Movie First look Out | ఒక్క క్షణం ఫస్ట్ లుక్ రివ్యూ.. నిఖిల్ సినిమా లాగేనా?

Allu sirish new movie first look

Allu Sirish, Okka Kshanam First look, Allu Sirish Okka Kshanam, Allu Sirish New Movie Poster, Allu Sirish New Movie First Look, Allu Sirish VI Anand, Love v/s Destiny

Allu Sirish Okka Kshanam First look Released. The Mega Hero's Next an interesting thrilling drama. Surabhi and Seerat Kapoor plays lead role.

ఒక్క క్షణం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Posted: 11/29/2017 02:12 PM IST
Allu sirish new movie first look

మెగా హీరోల్లో ప్రారంభంలో సక్సెస్ కోసం కష్టపడ్డ అల్లు శీరీష్ ఆ తర్వాత శ్రీ రస్తు శుభమస్తు సక్సెస్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులను అంగీకరిస్తూ కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు వి.ఐ. ఆనంద్ తో తర్వాతి సినిమాలో నటిస్తున్నాడు. అదే 'ఒక్క క్షణం'. ఈ సినిమా ఫస్టులుక్ ను ఈ ఉదయమే రిలీజ్ చేశారు.

కథానాయికకి అండగా నిలబడి, శత్రువుల దాడిని ధైర్యంగా ఎదుర్కొంటున్నవాడిగా ఈ పోస్టర్ లో అల్లు శిరీష్ కనిపిస్తున్నాడు. ఫస్టులుక్ తోనే అందరిలో కుతూహలాన్ని కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో సురభితో పాటు గ్లామర్ డాల్ సీరత్ కపూర్ కూడా కథానాయికగా నటిస్తోంది. చక్రి చిగురుపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న విడుదల చేద్దామని భావించినప్పటికీ.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవటంతో మరోసారి వాయిదా పడే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే కాకుండా బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ ప్రాజెక్టుతోపాటు పలు దక్షిణ భాషల చిత్రాల్లోనూ కొత్త ప్రాజెక్టులు చేసేందుకు శీరీష్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles