బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ చేసిన పనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే.. గోవాలో జరిగిన ఐఫీ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ అవార్డును అమితాబ్ కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అక్షయ్ కుమార్ అందజేశారు.
అయితే అవార్డు ఇవ్వడానికి ముందు ఆయనను వేదికపైకి ఆహ్వానిస్తూ...'అమెరికాకి సూపర్ మ్యాన్ ఉంటే..ఇండియాకి యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నారు' అంటూ అక్షయ్ కుమార్ పేర్కొంటూ బిగ్ బీని వేదికపైకి రావాలని కోరారు. అమితాబ్ వేదికపైకి రాగానే ఆయన కాళ్లకు అక్షయ్ నమస్కారం చేసేప్రయత్నం చేశాడు. వెంటనే ఆయనను నిరోధించిన అమితాబ్ అతనిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
దీనిపై ట్విట్టర్ లో బిగ్ బీ వీరాభిమాని ఒకరు ఫోటోను ట్వీట్ చేసి ‘అక్కీ మర్యాద’ అంటూ పోస్ట్ చేశాడు. దానికి ద్వారా స్పందించిన బిగ్ బి అక్షయ్ పై ప్రేమపూర్వక చిరుకోపం ప్రదర్శించారు. 'అక్షయ్! నువ్వలా చేసి ఉండాల్సింది. నాకు చాలా ఇబ్బంది కలిగింది' అంటూ పేర్కొన్నారు. వీరిద్దరూ ఆంఖే, ఖాకీ తదితర చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
embarrassed that Akshay does this .. no Akshay this is not done https://t.co/ySIylzttXJ
— Amitabh Bachchan (@SrBachchan) November 28, 2017
Charan Sparsh pic.twitter.com/rHMQGg9vs6
— EFAshok Mistry (@ashokmistry4545) November 28, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more