Actor Daughter Happy with Ivanka Tour | చంద్రమోహన్ కూతురిపై ట్రంప్ కూతురి ప్రశంసలు

Actress daughter praised by ivanka

Ivanka Trump, Actor Chandra Mohan, Chandra Mohan Daughter Madhavi, Chandra Mohan Ivanka Trump, Hyderabad Visit, Madhavi Classical Dancer, Ivanka Praise Chandra Mohan's Daughter

Ivanka Trump Happy with Senior Actor Chandra Mohan Daughter Madhavi's Classic Dance Performance.

చంద్రమోహన్ కూతురికి ఇవాంక ప్రశంసలు

Posted: 11/30/2017 08:49 AM IST
Actress daughter praised by ivanka

ఇవాంక ట్రంప్ పర్యటన నేపథ్యంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ చాలా సంతోషంగా ఫీలవుతున్నాడు. అందుకు కారణం ఆయన కుమార్తెకు ఇవాంకా నుంచి అభినందనలు వెల్లువెత్తటమే. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన ఇవాంకాకు హైదారాబాద్‌లోని చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఇచ్చారు. విందుకు ముందు కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మణిపురి వంటి సంప్రదాయ నాట్యాలన్నింటినీ కలిపి ఓ నృత్య సమ్మేళనం ఏర్పాటు చేశారు. .

ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్- ప్రముఖ రచయిత్రి జలంధర దంపతుల  కుమార్తె అయిన మాధవి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అదరహో అనిపించింది. ‘వన్స్‌మోర్’ అంటూ ఉత్సాహపరిచారు. కాగా, మాధవి ప్రదర్శన ముగిసిన వెంటనే వేదిక కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఇవాంకా సహా విందుకు హాజరైన ప్రతి ఒక్కరు ‘వన్స్ మోర్’ అనడం తానెప్పటికీ మర్చిపోలేనని మాధవి తెలిపారు. ఓ కళాకారిణిగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు

నృత్య కార్యక్రమం కోసం పన్నెండు రోజుల కిందటే తమ గురువు డాక్టర్ సత్యప్రియ రమణిని కేంద్రం ఆహ్వానించినట్టు ప్రదర్శన అనంతరం మాధవి తెలిపారు. సమయం తక్కువగా ఉండడంతో రాత్రి పగలు సాధన చేసినట్టు చెప్పారు.

Chandra Mohan Daughter Madhavi Ivanka Trump

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles